Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కూడా వర్మలా చేస్తున్నాడే..

By:  Tupaki Desk   |   28 Oct 2016 7:30 AM GMT
మెగాస్టార్ కూడా వర్మలా చేస్తున్నాడే..
X
తన సినిమాల గురించి చాలా అతిశయోక్తులు చెబుతూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా మొదలుపెట్టే ముందే ఆయన ప్రమోషన్ మొదలైపోతుంది. తన కొత్త సినిమా ‘సర్కార్-3’ విషయంలోనూ ఇలాగే చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసి.. అందులో సినిమా సినాప్సిస్ ఇచ్చాడు వర్మ. సర్కార్-3 ముందు.. తొలి రెండు భాగాలు జుజుబి అన్నట్లు మాట్లాడాడు వర్మ. ఇంకా ఈ సినిమా గురించి చాలా గొప్పలు చెప్పాడు. ఐతే వర్మకు ఇలాంటివన్నీ మామూలే కాబట్టి జనాలు లైట్ తీసుకున్నారు. ఐతే సర్కార్ పాత్రధారి అమితాబ్ బచ్చన్ కూడా ‘సర్కార్-3’ గురించి ఓ రేంజిలో పొగిడేస్తున్నాడు.

సర్కార్-3 ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరి నుంచి గొప్ప ఔట్ పుట్ రాబట్టుకుంటోందని.. ఇందులో చేసినట్లు ఎవరూ ఇంకే సినిమాలోనూ చేయలేదని అంటున్నాడు అమితాబ్. అంతే కాక సర్కార్-3లో ఉండటం తనకు దక్కిన గౌరవం అని కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు అమితాబ్. ఈ సందర్భంగా సర్కార్-3 స్టిల్స్ కూడా కొన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు బిగ్-బి. అవి చాలా ఇంటెన్సిటీతో ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. సర్కార్-3 మొదలైనపుడు కూడా అమితాబ్ చాలా ఎగ్జైట్మెంట్‌ తో కనిపించాడు. గత కొన్నేళ్లలో వర్మ ట్రాక్ రికార్డు చూసి.. అమితాబ్ సర్కార్-3 చేయడానికి ఒప్పుకోవడం ఒకరకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. దీనికి తోడు షూటింగ్ టైంలో కూడా ఇంత ఎగ్జైట్ అవుతున్నాడంటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/