Begin typing your search above and press return to search.

103 ఏళ్ల అభిమాని కోరిక తీర్చాడు

By:  Tupaki Desk   |   25 May 2017 8:15 AM GMT
103 ఏళ్ల అభిమాని కోరిక తీర్చాడు
X
అమితాబ్ బచ్చన్ లాంటి మెగా స్టార్ ను ఓ అభిమాని కలవడం అంటే మాటలు కాదు. కోట్లల్లో ఉన్న తన అభిమానులందరినీ కలడం అమితాబ్ కు సాధ్యమయ్యే విషయం కాదు. ఐతే ఓ అభిమాని మాత్రం అమితాబ్ ను కలవాలని ఎన్నో ఏళ్ల పాటు కలలు కంది. చివరికి 103 ఏళ్ల వయసులో ఆమె తన కోరికను నెరవేర్చుకుంది. ఆ అభిమాని తనను కలిసి అనిర్వచనీయ అనుభూతిని పొందిన క్షణాల్ని ట్విట్టర్ ఫాలోవర్లతో పంచుకున్నాడు అమితాబ్. ఆ అభిమాని పేరు క్రిస్టిన్. ఆమె కొన్ని దశాబ్దాల కిందటే అమితాబ్ కు అభిమానిగా మారింది. అప్పట్నుంచి ఆయన్ని ఎలాగైనా కలుసుకోవాలని ఆరాటపడింది. కానీ ఆమె కల నెరవేరలేదు.

చివరికి అమితాబ్ కు ఆమె గురించి ఎలా తెలిసిందో ఏమో.. ఆమెకు తను కలిసే అవకాశం కల్పించాడు. తనతో కలిసి ఫొటోలు కూడా దిగాడు. అమితాబ్ తనను ఆత్మీయంగా పలకరించడం.. ఫొటోలు దిగడంతో ఆమె ఆనందం పట్టలేకపోయింది. ఫొటోలకు ఫోజులిస్తూ ఆమె ఇచ్చిన హావభావాలు చూస్తే క్రిస్టిన్ కు అమితాబ్ ను కలవడం ఎంత ఆనందాన్నిచ్చిందో అర్థమవుతుంది. అభిమానిని ఇలా మురిపించినందుకు అమితాబ్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే ‘సర్కార్-3’తో ప్రేక్షకుల్ని పలకరించిన అమితాబ్.. అమీర్ ఖాన్ తో కలిసి చేయనున్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ కోసం రెడీ అవుతున్నాడు. దీంతో పాటు ఆయన ‘ప్యాడ్ మ్యాన్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/