మెగాస్టార్ కాబట్టే హీరో అయ్యాడు..!

Tue Jan 22 2019 07:00:01 GMT+0530 (IST)

బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్ కుమార్తె నవ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అమితాబ్ వారసురాలిగా నవ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమితాబ్ కూతురు శ్వేత ఆ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆమె కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఆ సందర్బంగా తన కూతురు సినీ ఎంట్రీ పై స్పందించింది. అమితాబ్ బచ్చన్ మనవరాలు హీరోయిన్ గా రాబోతుందా అంటూ కరణ్ అడిగిన ప్రశ్నకు శ్వేత సమాధానం లేదు అంటూ సమాధానం ఇచ్చింది.మా ఫ్యామిలీకి చెందిన వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారు సినిమా ఫ్లాప్ అయిన సమయంలో పడే బాధ షూటింగ్ సమయంలో పడే ఇబ్బందులు చూసిన తర్వాత నా కూతురు సినిమాల్లోకి వెళ్లేందుకు ఇష్టం లేదని అంది. అన్నయ్య అభిషేక్ బచ్చన్ గురించి సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్ నాకు బాధగా అనిపిస్తాయి. మెగాస్టార్ కొడుకు అవ్వడం వల్లే అభిషేక్ హీరో అయ్యాడు ఆయనకు అంత సీన్ లేదు అంటూ విమర్శలు ప్రతి రోజు వస్తూనే ఉంటాయి.

నా కూతురుకు అలాంటి విమర్శలు రావడం నాకు ఇష్టం లేదు. కష్టపడి హీరోయిన్ గా నవ్య పేరు తెచ్చుకున్నా కూడా మెగాస్టార్ అమితాబచ్చన్ మనవరాలు అవ్వడం వల్లే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుందని అంతా విమర్శిస్తారు. అందుకే ప్రస్తుతం నాకు నవ్య హీరోయిన్ అవ్వడం అనేది ఇష్టం లేదని చెప్పింది. అయితే నవ్య బలంగా కోరుకుంటే మాత్రం తానేం చేయలేనట్లుగా శ్వేత బచ్చన్ అన్నారు.