మళ్లీ బికినీలో బిగ్ బీ మనవరాలు

Mon Mar 20 2017 21:21:45 GMT+0530 (IST)

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా.. ఆన్ లైన్ లో బోలెడంత రచ్చ చేసేస్తూ ఉంటుంది. లేటెస్ట్ జనరేషన్ టీనేజ్ బ్యూటీ కావడంతో.. ఈ తరానికి తగినట్లుగా హంగామా బాగానే ఉంటుంది. ముఖ్యంగా అందాల ప్రదర్శన చేసేస్తూ.. ఫోటోలు తీసుకోవడం.. వాటిని నెట్ లో పెట్టేయడం ఈ భామకు బాగా అలవాటు.

ఈ ఏజ్ లో ఉండే అందరిలానే నవ్య కూడా బిహేవ్ చేస్తుంది కానీ.. బిగ్ బీ మనవరాలు కావడంతో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ గా ఇలా బికీనీలో బీచ్ లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ సందడి చేసింది నవ్య నవేలి నంద. పుట్టినప్పటి నుంచి ఉన్న సెలబ్రిటీ స్టేటస్ కారణంగా.. ఈ చిన్నది ఏం చేసినా వైరల్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే.. ఇలాంటివి వద్దని చెప్పే ప్రయత్నం బిగ్ బీ కూడా చేయరు.

పైగా కొన్ని నెలల క్రితం ఒక ఓపెన్ లెటర్ కూడా రాశారు. ఇలా ఉండాలి.. ఇలాంటి బట్టలేసుకోవాలని ప్రపంచం అంటూ ఉంటుందని.. కానీ మీకు నచ్చినట్లు మీరు ఉండండి అంటూ ఆయనే సపోర్ట్ చేశారు. లెజెండరీ స్టేటస్ ఉన్న తాతయ్య నుంచే పర్మిషన్ వచ్చేయడంతో.. అప్పటి నుంచి ఈ భామ హంగామా మరీ ఎక్కువైపోయిందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/