Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి ఎంత కష్టమొచ్చిందో!

By:  Tupaki Desk   |   1 Sep 2015 9:59 AM GMT
మెగాస్టార్ కి ఎంత కష్టమొచ్చిందో!
X
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను లేని పోని కష్టాలు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక మంచి చెప్పాలని చూసే ఈ పెద్దాయన్ని కొందరు ఆకతాయిలు టార్గెట్ చేశారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి.. చెత్త మెసేజ్ లవీ పెట్టి అభిమానుల్ని ఆయన ఫాలోయర్ లని అయోమయంలోకి నెట్టారు. ఈ సమస్య నుంచి బయటపడే లోపు అమితాబ్ ను ఇంకో విషయం చికాకు పెట్టింది. దాదాపు ఏడాది నుంచి ఆయన నెంబర్ కు ఓ వ్యక్తి అసభ్య సందేశాలు పంపిస్తున్నాడు. బూతులు కూడా తిడుతున్నాడు. ఐతే దీన్ని ముందు అమితాబ్ పెద్దగా పట్టించుకోలేదు. ఐతే ఈ మధ్య అవతలి వ్యక్తి మరీ శ్రుతి మించి పోయాడు. తీవ్ర పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు.

దీంతో అమితాబ్ రంగంలోకి దిగక తప్పలేదు. ముంబయిలోని ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఐతే చాన్నాళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నా.. ఇంతకాలం ఎందుకు సైలెంటుగా ఉన్నారని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ నంబర్ ఎవరిదో కనుక్కుని ఆ వ్యక్తికి బడిత పూజ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. గుర్తు తెలియని నంబర్ నుంచి అమితాబ్ కు ఎసెమ్మెస్ లు వస్తున్నట్లు గుర్తించారు. బిగ్-బి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయడానికి, ఈ ఎసెమ్మెస్ లకు సంబంధం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. సెలెబ్రెటీలకు ఇలాంటి కష్టాలు కొత్తేమీ కాదు కానీ.. అమితాబ్ వివాదాలకు దూరంగా ఉండే మనిషి. సాధ్యమైనంత వరకు మంచిని పంచాలని చూస్తే అమితాబ్ జీని ఇలా ఇబ్బంది పెట్టాలన్న దారుణమైన ఆలోచన ఎవరికి, ఎందుకు వచ్చిందో?