బాద్ షా కొడుకు కోరిక బిగ్-బి తీర్చాడు

Mon Nov 20 2017 16:42:04 GMT+0530 (IST)

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఆర్యన్.. సుహానాలతో పాటు కొంచెం లేటుగా మరో సంతానం కూడా కలిగిన సంగతి తెలిసిందే. సరోగసీ ద్వారా అతను కన్న కొడుక్కి అబ్ రామ్ అనే పేరు పెట్టుకున్నాడు. అచ్చం తన పోలికలతో దిగిపోయిన ఈ కుర్రాడంటే షారుఖ్ కు చాలా ఇష్టం. ఈ బుడతడి ఫొటోల్ని.. అతడి ముచ్చట్లని ఎప్పటికప్పుడు సోషల్ మీడయాలో పంచుకుంటూ ఉంటాడు షారుఖ్.  తాజాగా అబ్ రామ్ గురించి ఓ ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఇటీవలే అబ్ రామ్.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ద్వారా తనకు కావాల్సింది కొని పెట్టుకున్నాడట.ఈ మధ్యే ఒక చోట షారుఖ్.. అమితాబ్ కలిశారట. ఆ సందర్భంగా షారుఖ్ వెంట అబ్ రామ్ కూడా ఉన్నాడట. ఆ సమయంలో పీచు మిఠాయి కోన్ కోసం మారాం చేశాడట అబ్ రామ్. దీంతో స్వయంగా బిగ్-బినే అతడి కోసం పీచు మిఠాయి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్లి కోని  చేయించుకుని వచ్చి అతడికి ఇచ్చాడట. దీనికి సంబంధించిన దృశ్యాల్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు అమితాబ్. అబ్ రామ్ ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోడని.. టీవీలో బిగ్-బి కనిపించినపుడల్లా ఆయన్ని తన తండ్రిగా భావిస్తాడని షారుఖ్ వ్యాఖ్యానించాడు. అమితాబ్ తో షారుఖ్ కు మంచి అనుభంధం ఉంది. వీళ్లిద్దరూ కలిసి ‘కబీ ఖుషీ కబీ గమ్’ సినిమాలో నటించారు.