చికాగో సెక్స్ రాకెట్ : ఆడియో టేపుల లీక్..

Tue Jun 19 2018 17:03:46 GMT+0530 (IST)


అమెరికాలో బయటపడిన చికాగో సెక్స్ రాకెట్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ రాకెట్ నిర్వహించిన కిషన్-ఆయన భార్య చంద్రలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో ఐదుగురు హీరోయిన్లను అక్కడి పోలీసులు విక్టిమ్స్ గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ విక్టిమ్స్ ఎవరన్న దానిపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలానా హీరోయిన్ అని.. ఫలానా యాంకర్ అంటూ మీడియాలో కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.అయితే అందరినీ షేక్ చేస్తున్న ఈ కేసులో తాజాగా ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో అందరూ అవాక్కవుతున్నారు. బ్రోకర్ కిషన్ కొందరు నటీమనులు - యాంకర్స్ తో మాట్లాడిన మాటల ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఈ టేపులు అసలు ఎలా బయటకు వచ్చాయన్నది అంతుచిక్కడం లేదు. అతి తక్కువ కాలంలోనే సినీ పరిశ్రమకు అత్యంత సన్నిహితుడిగా ఎదిగిన కిషన్ పై అమెరికాలోని తెలుగు సంఘాలే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు మధ్యవర్తులు కూడా ఈర్ష పడుతుంటారు. వ్యభిచార రాకెట్ తో కోట్లు సంపాదించిన కిషన్ వ్యహారాన్ని జీర్ణించుకోలేని కొందరు కావాలనే  ఈ ఆడియో టేపులు లీక్ చేశారని వార్తలు వస్తున్నాయి. 

కాగా కిషన్ మాట్లాడిన ఆడియో టేపుల్లో తమ వాయిస్ బయటపడుతుందేమోనని తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు నటీమణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘ఆ రాకెట్ తో మాకు సంబంధం లేదు’ అని ప్రకటించిన తారలంతా ఆడియో టేపులతో ఇరుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే కిషన్ ఆడియో టేపులు విడుదలయ్యాక త్వరలోనే వీడియో క్లిప్స్ కూడా విడుదలవుతాయనే ప్రచారం రావడంతో టాలీవుడ్ షేక్ అవుతోంది. మొత్తంగా ఇప్పుడు అమెరికాలో జరిగిన ఈ వ్యభిచార కూపంపై రోజుకో లీక్ తో అందరూ అవాక్కవుతున్నారు.TAGS: