Begin typing your search above and press return to search.

పాత కథకు కొత్త తారాగణం

By:  Tupaki Desk   |   12 March 2018 7:21 AM GMT
పాత కథకు కొత్త తారాగణం
X
దేవా కట్ట తీసిన వెన్నెల అయినా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన డాలర్ డ్రీమ్స్ అయినా - కథ కొంచెం అటూ ఇటుగా ఒకటే. భారత దేశం నుండి చదువలకనో జాబ్ పరంగానో అమెరికా వెళ్లిన యువత ఎం చేస్తున్నారు అనే నేపధ్యం మీదే సాగుతాయి. నిజానికి ఈ ప్లాట్ లైన్ తో వచ్చిన సినిమాలు కోకొల్లలు. కానీ హిట్ అయినవి మాత్రం ఒకటో రెండో. ఇప్పుడు మళ్లీ అలాంటిదే ఒక సినిమా రాబోతోంది.

ఆ సినిమానే 'ఎ2ఎ' (అమీర్ పెట్ 2 అమెరికా). టైటిల్ తో ఒక రకంగా సినిమాపై ఆసక్తిని పెంచారనే చెప్పచ్చు దర్శక నిర్మాతలు. అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ యూట్యూబ్ స్టార్ వైవా హర్ష లాంటి తెలిసిన మొహాలు కూడా ఉండటంతో కొంచెం హైప్ వచ్చింది. ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా కథ ఏంటో రఫ్ గా చెప్పకనే చెప్పేసారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కొంతమంది కుర్రాళ్లు అక్కడికి వెళ్లక మన విలువల్ని మరచిపోయి అక్కడి కల్చర్ కి ఎలా అలవాటు పడ్డారు - బ్రేకప్ లు - ప్రేమలు - అలా అన్ని సినిమాలను కలిపేసి ఒక కథ తయారు చేసినట్టు ఉంది.

డైలాగులు చాలా వరకు బాగానే ఉన్నాయి. కాకపోతే మరీ రొటీన్ కథతో కొత్త తారాగణంతో వచ్చే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే.

వీడియో కోసం క్లిక్ చేయండి