ఏకంగా పెద్ద ఊరునే సృష్టించేశారుగా

Mon Feb 19 2018 21:35:42 GMT+0530 (IST)

పెద్ద హీరోల సినిమాల కోసం భారీ సెట్లను నిర్మించడం మామూలే. కానీ ఏకంగా ఒక ఊరినే సృష్టించేయడం మాత్రం వింతే. పోనీ ఆ ఊరు ఇప్పుడు లేదా అంటే... ఉన్న ఊరునే తమ షూటింగ్ కోసం తిరిగి క్రియేట్ చేశారు. అంతేమరి క్రేజీ హీరో కోసం ఏమైనా చేయాలి కదా. ఇంతకీ ఆ హీరో ఎవరంటే సూర్య... మరి ఆ సృష్టికర్త... సెల్వ రాఘవన్... తమిళ దర్శకుడు.ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ సూర్య నటిస్తున్న 36వ సినిమా. ఇందులో రకుల్ ప్రీత్ - సాయి పల్లవి నటిస్తున్నాడు. తిరునల్వేలి జిల్లాలోని అంబసముద్రం ఊరి ప్రస్తావన సినిమాలో ఉంది. ఆ ఊరిలోనే కథ సాగుతున్నట్టు తీస్తున్నారు. కానీ ఆ ఊరిలో ఒక్క సీన్ తీయలేదు. అందుకోసం చెన్నైలోనే మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంబసముద్రం ఊరినే సృష్టించేశారు. అక్కడ ఉన్నట్టే గుళ్లు - ఇళ్లు సెట్స్ వేశారు. ఆ సెట్స్ మధ్యలోనే సినిమా తీసుకున్నారు. నిజమైన ఊరిలోనే సినిమా తీసుకోవచ్చు కదా... అంటే అంబసముద్రంలో జనాలు ఎక్కువే. తాము కోరుకున్నట్టు సీన్లు తీసేందుకు కావాల్సిన ప్రైవసీ అక్కడ దొరకదని భావించాడట సెల్వ. అందుకే ఆ ఊరినే క్రియేట్ చేసి... కూల్ గా సినిమా తీసుకుంటున్నారట.

తాజాగా విడుదలైన సూర్య గ్యాంగ్ సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. ఏ సెంటర్లో కూడా సినిమా బావుందన్న టాక్ రాలేదు. దీంతో సినిమా వచ్చినట్టే... వచ్చి ధియేటర్లలోంచి వెళ్లిపోయింది. ఈ సినిమాకు నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్ లీడింగ్ లేడీగా కనిపించింది. రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది.