Begin typing your search above and press return to search.

మాస్‌ రాజాకి సెన్సార్ యుఏ

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:58 PM GMT
మాస్‌ రాజాకి సెన్సార్ యుఏ
X
మాస్ మ‌హారాజ ర‌వితేజ‌- ఇలియాన జంట‌గా శ్రీ‌ను వైట్ల దర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` ఈనెల 16న రిలీజ‌వుతోంది. ర‌వితేజ‌ - శ్రీ‌నువైట్ల‌కే కాకుండా స‌వ్య‌సాచి ఫ్లాప్ త‌ర్వాత మైత్రి సంస్థ‌కు ఈ సినిమా విజ‌యం ఎంతో ఇంపార్టెంట్. అయితే స‌క్సెస్‌ పై మైత్రి అధినేత‌లు స‌హా వైట్ల పూర్తి కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు. ర‌వితేజ ఇప్ప‌టివ‌ర‌కూ మీడియా ముందుకు రాలేదు. తాజాగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. స‌రిగ్గా రెండున్న‌ర గంట‌ల సినిమా ఇది. 153 నిమిషాల నిడివితో సాగ‌నుంది.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని మైత్రి సంస్థ రాజీలేని ప్ర‌య‌త్న‌మ‌ని విజువ‌ల్స్ చెబుతున్నాయి. మాస్ మ‌హారాజా త‌న‌కో ఛాన్స్ ఇచ్చినందుకు వైట్ల పేరు నిల‌బెడ‌తాడ‌నే ఆశిస్తున్నారంతా. ఇక ఈ చిత్రానికి టైటిల్ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని త‌ప్ప ఇంకో ఆప్ష‌నే లేనే లేద‌ని వైట్ల తెలిపారు. క‌థ‌నుంచే టైటిల్ వ‌చ్చింది. మొద‌ట‌గా నా మైండ్‌ లోకి ఈ టైటిల్ ఆలోచ‌న రాగానే ర‌వితేజ‌కు చెప్ప‌గానే అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చార‌ని అన్నారు. గ‌తం నుంచి నేర్చుకుని వ‌ర్త‌మానంలో ఈ సినిమా కోసం ఎంతో హార్డ్‌ వ‌ర్క్ చేశాన‌ని - తాజా చిత్రంలో క‌థ - క‌థ‌నాలు హైలైట్‌ గా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాన‌ని తెలిపారు. ప్రేక్ష‌కులు న‌న్ను వింటేజ్ శ్రీ‌ను వైట్ల‌ గా చూడాల‌నుకున్నారు. ఇక‌మీద‌ట అలానే క‌నిపిస్తాన‌ని కాన్ఫిడెన్స్ వ్య‌క్తం చేశాడు. మొత్తానికి ఏఏఏ అత‌డి కి కొత్త లైఫ్‌ నిస్తుంద‌నే అభిమానులు భావిస్తున్నారు.

చివ‌రి మూడు సినిమాలు వైట్ల జ్ఞాప‌కాల్లోంచి తీసేస్తే ఏఏఏ మాత్రం తీపి జ్ఞాప‌కంగా మిగులుతుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. జ‌నం ఓ బ్రాండ్ వేశారు.. ఆ బ్రాండే పెద్ద బాధ్య‌త‌. ఆ బ్రాండ్‌ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయ‌డం స‌వాల్ లాంటిది. కొత్త క‌థ‌ల‌తో సినిమాలు చేయ‌డానికి కొన్ని చిక్కులున్నాయ‌ని - కొత్త క‌థ‌ల‌తో సినిమాలు చేయ‌డం అన్న‌ది బాధ్య‌త అని చెప్పాడు వైట్ల‌. మ‌రో రెండ్రోజుల్లో అత‌డు చెప్పిన మాట‌ల విలువ థియేట‌ర్ల‌లో తేల‌నుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాలి.