అమల సిగరేట్.. అలా ఎలా?

Tue Sep 12 2017 22:53:01 GMT+0530 (IST)

మలయాళీ భామలకు ఈ మధ్య ఏమయిందో ఏమో గాని ఊహించని విధంగా మారిపోతున్నారు. సౌత్ లో ఏ హాలీవుడ్ గాలి సోకిందో మరి హీరోయిన్స్ లిమిట్స్ ని అస్సలు లెక్కచేయడం లేదు. బాలీవుడ్ బామాలకన్నా ఎక్కువ కాంట్రావర్సీలని క్రియేట్ చేసుకుంటున్నారు. పబ్ లో మందు తాగుతూ సీక్రెట్ గా ఏఫైర్స్ ని నడిపిస్తూ.. ఏ మాత్రం హద్దులు లేకుండా స్వేచ్ఛగా జీవితాన్ని ఆనందిస్తున్నారు. ఇక సినిమాల్లో అవకాశాలు రాకుంటే.. టాప్ లెస్ అందాలతో షాక్ ఇస్తున్నారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వెలితే చూడగానే అయ్యో ఎంతో పద్దతిగా ఉందొ అనుకునేలా ఉండే అమల పాల్..ఇప్పుడు అయ్యే ఇదేం పద్ధతి అమ్మా నీకు అనేలా రెచ్చపోయింది. సెగలు రేపుతున్న మంటలను చూపిస్తు పిట్టగొడ మీద సిగరెట్ కాలుస్తూ దర్శనమిచ్చింది. గుప్పు గుప్పుమంటూ పొగలని వదులుతోంది. ఏ సినిమాలో నటించిందో తెలియదు గాని అమ్మడు సిగరెట్ కలుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మరింది. చూసినవారంతా అసలు అమల పాల్ కాదు అని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అమ్మడు అంత అమాయకంగా ఉండేది మరి. అయితే ఇది మలయాళం సినిమా అయిన 'అచ్చాయన్స్'లో అమ్మడి ఓపెనింగ్ సీన్ అని తెలుస్తోంది. ఆ సినిమా మొన్న మే నెలలరో రిలీజై ఫ్లాప్ అవ్వగా.. ఇప్పుడిలా పైరసీ వీడియోతో ఈమె పొగత్రాగుడు యవ్వారం బయటపడింది.

డైరెక్టర్ విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత గ్లామర్ డోస్ ని ఇంకాస్త పెంచేసింది అమలా పాల్. రీసెంట్ గా విఐపి 2 లో కూడా అమలు ఘాటుగానే కనిపించి కుర్రకారు మతి చెడగొట్టింది. ఇక ఇప్పుడు సిగరెట్ తాగుతూ ఏకాంగా దిమ్మ తిరిగేలా చేసింది. నటన పరంగా అయితే పరవాలేదు కానీ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే పబ్లిక్ లో అమ్మడి వాల్యూ పడిపోక తప్పదు అంటున్నారు నెటీజన్స్.