ఫోటో స్టొరీ: ఈ కళ కూడా ఉందా అమలా..?

Mon Dec 17 2018 15:51:54 GMT+0530 (IST)

సౌత్ లో ఉండే చాలామంది హీరోయిన్లలో అమలా పాల్ కు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది.  నటన.. గ్లామర్.. కాంట్రవర్సీలు ఇలా అన్నిటికీ కేరాఫ్ అడ్రెస్ ఉండేలా ఒకరి పేరు చెప్పమంటే మనం అమలాపాల్ పేరు చెప్పుకోవాల్సిందే. అమల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. తరచుగా ఫోటోలు వీడియోలు..తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లు పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.ఈమధ్య అమలా పాల్ తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో అమల సిగరెట్ కాలుస్తూ ఉంది. పొగవదులుతూ ఒక హాట్ లేడీలాగా పోజిచ్చింది. దీనికి ఓ పెద్ద క్యాప్షన్ కూడా ఇచ్చింది.."నేను స్మోకింగ్ ను ప్రోత్సహించడం లేదు. హాలీవుడ్ ఫ్యాన్ గర్ల్ డ్రీమ్ ను తీర్చుకున్నాను. ప్రతిఒక్క స్టార్ కు ఒక ఐకానిక్ స్మోకింగ్ షాట్ ఉంది... ఇది నా ఫోటో."

హాలీవుడ్ ఫిలిమ్స్ లో ఇలాంటి స్మోకింగ్ షాట్స్ చాలా ఫేమస్.. ఇక 'ఫ్యాషన్' లాంటి బాలీవుడ్ సినిమాల్లో కంగన రనౌత్ స్మోకింగ్ సీన్స్ లో ఇరగదీసింది. ఇప్పుడు అమల కూడా అలానే తన స్మోకింగ్ ఫోటో డ్రీమ్ తీర్చుసుకుంది.  ఈ లెక్కన సినిమా థియేటర్లో ఫస్ట్ హాఫ్ ముందొకసారి.. సెకండ్ హాఫ్ ముందొకసారి వచ్చి ప్రేక్షకులకు పరిక్ష పెట్టే ముఖేష్ ను అస్సలు పట్టించుకోలేదు..!