Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ చూసి కాదు.. వారికి నేను న‌చ్చ‌క తీసేశారు

By:  Tupaki Desk   |   16 July 2019 6:08 AM GMT
ట్రైల‌ర్ చూసి కాదు.. వారికి నేను న‌చ్చ‌క తీసేశారు
X
తాజా సంచ‌ల‌నం అమ‌లాపాల్. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తూ.. న‌టించే అవ‌కాశం ఉండే ఛాలెంజింగ్ పాత్ర‌ల్ని పోషించేందుకు తానెప్పుడూ రెఢీ అని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. వ్య‌క్తిగ‌తం కావొచ్చు.. వృత్తిప‌రంగా కావొచ్చు.. త‌ర‌చూ వార్త‌ల్లో ఉండే అమ‌లాపాల్.. ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తుంటార‌న్న కంప్లైంట్ ఉంది.

అదే విష‌యాన్ని అమ‌లాపాల్ ముఖం మీద‌నే సూటిగా అడిగేస్తే? ఆమె నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుంద‌న్న క్వ‌శ్చ‌న్ అక్క‌ర్లేదు. ఎందుకంటే.. త‌న మీద వ‌చ్చే కంప్లైంట్ గురించి ఆమె ఓపెన్ గా మాట్లాడారు. తాను ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని ఇబ్బందిపెడ‌తాన‌నే దాన్లో అస్స‌లు నిజం లేద‌ని.. అదే నిజ‌మైతే.. తాను ఇంత‌మంది ద‌ర్శ‌కనిర్మాత‌ల‌తో పని చేయ‌లేను క‌దా? అంటూ లాజిక్ బ‌య‌ట‌కు తీశారు.

ఇటీవ‌ల అమ‌లాపాల్ న‌టించిన ఆమె ట్రైల‌ర్ చూసి విజ‌య్ సేతుప‌తి సినిమా నుంచి తొల‌గించిన ఎపిసోడ్ మీద స్పందించారు. వారికి తాను న‌చ్చ‌లేద‌ని.. అంతే కానీ తానుఇబ్బంది పెట్టినందుకు కాద‌న్నారు. చాలా సినిమాల‌కు త‌న రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవ‌ట‌మే కాదు.. కొన్నిసార్లు త‌న డ‌బ్బుల‌తో కాస్ట్యూమ్స్ కొనుక్కున్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయ‌న్నారు.

షూటింగ స‌మ‌యంలో స‌మ‌కూర్చే వ‌స‌తుల విష‌యంలోనూ తాను రాజీ ప‌డ‌తాన‌ని.. అస్స‌లు గొడ‌వ ప‌డ‌న‌న్నారు. నాకు స‌మ‌కూర్చే స‌దుపాయాల్లో అసౌక‌ర్యం క‌లుగుతున్నా భ‌రిస్తానే కానీ.. ఎప్పుడూ ఎందుకిలా అని ప్ర‌శ్నించింది లేద‌న్నారు. విజ‌య్ సేతుప‌తి ప్రొడ‌క్ష‌న్ వారికి తాను న‌చ్చ‌లేద‌ని.. ఆ విష‌యాన్ని నేరుగా చెప్పేస్తే స‌రిపోయేద‌ని..దాన్నో ఇష్యూగా చేయ‌టం మాత్రం త‌న‌ను బాధించింద‌ని చెప్పారు. త‌న‌కివ్వాల్సిన రెమ్యున‌రేష‌న్ ను సైతం చాలా సంద‌ర్భాల్లో ఇంకా ఇవ్వ‌లేద‌ని అడిగిందే లేదంటూ.. తానెలా ఉంటాన‌న్న విష‌యంపై క్లారిటీ ఇచ్చారు అమ‌లాపాల్.