Begin typing your search above and press return to search.

అమలా పాల్.. మరో క్రేజీ పోస్టర్

By:  Tupaki Desk   |   19 July 2019 2:12 AM GMT
అమలా పాల్.. మరో క్రేజీ పోస్టర్
X
మలయాళం బ్యూటీ అమలా పాల్ కొత్త సినిమా 'ఆమె' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణ థ్రిల్లర్ అంటే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదేమో కానీ ఈ సినిమాలో అమల నగ్నంగా నటించిన సీన్ ఉండడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అదొక్కటే కాకుండా ఇంట్రెస్టింగ్ ప్రోమోస్.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి మరో తమిళ వెర్షన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అమలా ఇంటెన్స్ లుక్ లో ఒక ఇనుప రాడ్ ను చేతిలో పట్టుకుని నిలబడి ఉంది. ఇక దుస్తులకు బదులుగా క్రైమ్ సీన్ లో 'కాషన్: డు నాట్ క్రాస్ ది లైన్' అని రాసి ఉండే పసుపు రంగు స్ట్రిప్ ను దుస్తుల లాగా చుట్టుకుంది. ఈ పోస్టర్ సినిమాపై మరింతగా ఆసక్తిని రేపేలా ఉంది. ఇప్పటికే ఈ పోస్టర్లతో ఆసక్తి నెలకొంది కాబట్టి సినిమాలో కంటెంట్ కూడా ఉంటే అమలా పాల్ కు మంచి హిట్ దక్కడం ఖాయమే.

థ్రిల్లర్ జోనర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్య సుబ్రమణియన్.. శ్రీ రంజని.. వివేక్ ప్రసన్న ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ప్రదీప్ కుమార్. ఈ సినిమాకు దర్శకుడు రత్నకుమార్. 'ఆమె' తెలుగు వెర్షన్ కు నిర్మాతలు రాంబాబు కల్లూరి.. విజయ్‌ మోరవెనేని.