Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అమల దెబ్బకు నెటిజనులు విలవిల

By:  Tupaki Desk   |   17 Oct 2018 5:46 PM GMT
ఫోటో స్టొరీ: అమల దెబ్బకు నెటిజనులు విలవిల
X
మలయాళ బ్యూటీ అమలా పాల్ పేరు తెలీని సినీ ప్రేమికులు దాదాపుగా సౌత్ లో ఉండరు. ఒక్క సినిమాలే అయితే తెలియకపోవచ్చుగానీ.. వివాదాలతో ఎప్పుడూ ఫిలిం న్యూస్ హెడ్లైన్స్ లో ఉండే అమల పేరు తెలియకుండా ఎలా ఉంటుంది. తాజాగా అమలా పాల్ కి సంబంధించిన కొన్ని హాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలు ప్రత్యేకంగా ఒక ఫోటోషూట్ కి సంబంధించినవి అని తెలుస్తోంది కానీ అమలా మాత్రం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేయలేదు. కానీ ఈ ఫోటోల్లో మల్లు బ్యూటీ కాస్తా మహా సెక్సిణి గా మారినట్టుంది. పారదర్శకంగా ఉండే వైట్ టాప్ లోన ఉన్న పింక్ కలర్ ఇన్నర్ కనిపిస్తూ ఉంటే.. అసలు మేకప్పే లేకుండా లూజ్ హెయిర్ తో ఒక సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఇక క్లీవేజ్ షో సంగతి సరే సరి.

ఇంతకీ ఇంత హాటు ఫోటోషూట్ వెనక కారణం ఏంటంటే ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ బిజినెస్ కంపెనీ తో టై-అప్ అయిందట. 'ది హిమాలయన్ యోగి' అనే బ్రాండ్ తో వాటిని మార్కెట్ లోకి తీసుకొస్తారట. ఊరికే తీసుకొస్తే ఎవరికీ తెలుస్తుంది.. ఎవరు కొంటారు? అందుకే ఇలా ఘాటు ఫోటో షూట్ చేసిందట. దీనివాళ్ళ ఏం ఉపయోగం అని మీరడిగితే ఇంకేం చెప్పాలి మీకు. ఇప్పుడే మీకు ది హిమాలయన్ యోగి(THM) బ్రాండ్ తెలిసిందిగా.. ఆమె నిండుగా కప్పుకొని ఉంటే ఇదంతా ఉండేది కాదు.. మీరు అసలు చదివేవారు కాదు. అది తత్వం. ఓం తత్సత్!