ఫోటో స్టొరీ: అందంగా అమలా పాల్

Mon Dec 10 2018 13:47:18 GMT+0530 (IST)

కేరళ బ్యూటీ అమలా పాల్ పేరు సౌత్ లో దాదాపుగా సినిప్రేమికులందరికీ తెలిసిందే.  సినిమాలు మాత్రమే కాకుండా వివాదాలతో కూడా సావాసం చేయడం అమలకు చాలా కామన్.  డైరెక్టర్ AL విజయ్ తో వివాహం.. అ తర్వాత విడాకులు..  లగ్జరీ కారు టాక్స్ ఎగవేత కేసులో ఆరోపణలు..  ఓ తమిళ స్టార్ హీరో తో ఎఫైర్ గాసిప్పులు.. ఇవి చాలవా ఆమెను సూపర్ పాపులర్ చేసేందుకు?ఇంత స్పైసీ లైఫ్ ను లీడ్ చేసే అమల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఓషన్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని యాక్సెసరీస్ ఏవీ లేకుండా సింపుల్ గా పోజిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లో ఫుల్ గ్రీనరీ ఉండడంతో ఫోటోకే కొత్త అందం వచ్చింది. సాధారణంగా  అమలా ఫోటోలు ఘాటుగా ఉంటాయి. కానీ ఇది మాత్రం కొంచెం ఘాటుగా కొంచెం క్యూటుగా ఉంది.  ఫోటోలో అమల ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సిబుల్ గా ఉంది.

ఈ ఫోటోకు అమల ఇచ్చిన క్యాప్షన్ "మీరు ఒక్కోసారి జస్ట్ అలా కూర్చోండి.  మీ భుజాలను మీరు ఒకసారి తట్టుకోండి(మిమ్మల్ని మీరే మెచ్చుకోండి). జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అలా ఆస్వాదించండి.. మనస్ఫూర్తిగా.. సంతోషంగా! #ఫ్రీ స్పిరిట్".   ఇక ఈ అమ్మడు నటించే సినిమాల విషయానికి వస్తే రెండు తమిళంలోనూ ఒకటి మాలయాళంలోనూ నటిస్తోంది. అర్జున్ రాంపాల్  హీరోగా తెరకెక్కుతున్న ఓ హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ డెబ్యూ కి కూడా రెడీ అవుతోంది.