Begin typing your search above and press return to search.

అబ్బే అమలను తీసేయలేదంట బాసూ

By:  Tupaki Desk   |   27 Aug 2016 3:30 PM GMT
అబ్బే అమలను తీసేయలేదంట బాసూ
X
ఓకె.. స్ర్టయిట్ గా పాయింటులోకి వచ్చేద్దాం. త్వరలో మాజీ కాబోతున్న మొగుడు ఏ.ఎల్.విజయ్ ప్రభావంతో 'వడా చెన్నయ్' సినిమాలో నుండి ధనుష్‌ బాబు హీరోయిన్ అమలా పాల్ ను తప్పించేశాడనే వార్తలున్నాయి. అదంతా విజయ్ కొడుతున్న స్మార్ట్ దెబ్బ అంటూ తమిళ మీడియాలో కూడా చాలా వార్తలే వచ్చాయి. కాని ఇందులో నిజం లేదని తెలుస్తోంది.

నిజానికి 'వడా చెన్నయ్' సినిమాలో అమలా పాల్ తనే సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకోవాలని చూస్తోంది. అయితే ఈ సినిమాలోని పాత్ర కోసం నార్త్ చెన్నయ్ లో మాట్లాడే స్లాంగ్ వాడాలని దర్శకుడు కోరాడట. అందుకే తమిళ బాషలో ప్రావిణ్యం సంపాదించడానికి.. ఆ స్లాంగ్ ను కాస్త కంఠస్తం పట్టడానికి అమల టైమ్ అడిగిందట. ఇప్పుడు అవన్నీ సెట్టయిపోవడంతో.. ఈరోజు నుండి అమల సినిమా షూటింగులో పాల్గొందని తెలుస్తోంది. అంటే అమలను ఈ సినిమాలోనుండి తీసేయలేదనేగా దానర్దం.

అయితే అమల స్వయంగా ధనుష్‌ తో కూడిన ఫోటో ఒకటి లొకేషన్ నుండి ట్వీటేస్తా గాని జనాలు ఈ విషయం నమ్మరేమో.