Begin typing your search above and press return to search.

ముస్లిం ప్రేమికురాలుగా అమల!!

By:  Tupaki Desk   |   27 March 2017 6:43 AM GMT
ముస్లిం ప్రేమికురాలుగా అమల!!
X
రామ్ చరణ్ మూవీ నాయక్.. అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించిన అమలాపాల్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. చివరగా ఈమె తెలుగులో నానికి జోడీగా జెండాపై కపిరాజులో కనిపిచింది. ఇప్పుడు కొత్త దర్శకుడు చరణ్ తేజ్ రూపొందిస్తున్న ఓ రొమాంటిక్ డ్రామాకి సైన్ చేసింది అమలా పాల్.

ఆయుష్మాన్ భవ అనే టైటిల్ పై రూపొందనున్న ఈ చిత్రంలో.. అమలాపాల్ ఓ ముస్లిం యువతిగా కనిపించనుంది. 'ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అమలాపాల్ సంతకం చేసింది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలి చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామ్ ఇంది. ఓ ముస్లిం అమ్మాయి- హిందు కుర్రాడి ప్రేమకథతో స్టోరీ లింక్ అయి ఉంటుంది' అని చెప్పాడు దర్శకుడు. ఈ ముస్లిం యువతి పాత్రనే అమలాపాల్ చేయబోతోంది. అలాగే ఈ మూవీలో జూనియర్ ఐష్ అనిపించుకున్న స్నేహా ఉల్లాల్ కూడా ఓ స్పెషల్ రోల్ చేయనుండడం విశేషం.

హీరోయిన్ ప్రేమను సపోర్ట్ చేసే పాత్రలో స్నేహా ఉల్లాల్ కనిపించనుండగా.. సినిమాలో ఇది కీలకమైన పాత్ర అని.. ఆమె పై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని చెప్పాడు దర్శకుడు చరణ్ తేజ్. ఏప్రిల్ 15 నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈస్ట్ గోదావరి.. హైద్రాబాద్ లతో పాటు.. దుబాయ్-ఇజ్రాయిల్ లో కూడా షూట్ చేయనున్నారట. అలాగే సన్నీ లియోన్ తో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని కూడా భావిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/