Begin typing your search above and press return to search.

ఆమె వాయిదా ఉద‌యం ఆట‌ వ‌ర‌కే!

By:  Tupaki Desk   |   19 July 2019 8:25 AM GMT
ఆమె వాయిదా ఉద‌యం ఆట‌ వ‌ర‌కే!
X
అమ‌లాపాల్ న‌టించిన డ‌బ్బింగ్ సినిమా `ఆమె` (ఆడై) సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. పోస్ట‌ర్.. టీజ‌ర్.. ట్రైల‌ర్ ప్ర‌తిదీ సంచ‌ల‌నం కోస‌మే పాకులాట క‌నిపించింది. అమ‌లాపాల్ బోల్డ్ లుక్ .. న‌గ్నత్వం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారాయి. అమ‌లాపాల్ బోల్డ్ యాక్ట్ పై భ‌రితెగించిందంటూ మ‌హిళామండ‌ళ్లు గుర్రుమ‌న్నాయి. అటు త‌మిళ‌నాడు .. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దీనిపై వాడి వేడిగా చ‌ర్చ సాగింది. కొంద‌రు కోర్టు కేసులు వేయ‌డంతో ఈ సినిమా రిలీజ‌వుతుందా అవ్వ‌దా? అంటూ సందిగ్ధ‌త ఏర్ప‌డింది.

అయితే ఈ సినిమా నేడు త‌మిళ‌నాడులో ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలీజైంది. అక్క‌డ దాదాపు 500 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కావాల్సి ఉన్నా అనూహ్యంగా చివ‌రి నిమిషంలో వాయిదా ప‌డింది. ఏపీ-తెలంగాణ‌లో రిలీజ్ కాక‌పోవ‌డానికి కార‌ణాలేంటి? అని మీడియా వ‌ర్గాల్లో ఆరాతీస్తే కొన్ని ఆర్థిక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది. అయినా ఈ వాయిదా కేవ‌లం మోర్నింగ్ షో వ‌ర‌కేన‌ట‌. ఉదయం ఆట వేయ‌క‌పోయినా మ‌ధ్యాహ్నం షోకి ఆన్ లైన్ లో టిక్కెట్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం మ‌ధ్యాహ్నం.. ఈవెనింగ్ షోస్ కి సంబంధించిన టిక్కెట్లు అందుబాటులోకి వ‌చ్చాయి.. అంటే టెక్నిక‌ల్ ప్రాబ్లెమ్ క్లియ‌రైన‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే క్యాన్సిల్ చేసిన ప్రెస్ షోని తిరిగి వేయనున్నార‌ట‌.

ఈ సినిమాని తెలుగు వెర్ష‌న్ ని దర్శ‌క‌నిర్మాత‌ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ రిలీజ్ చేస్తున్నారు. ఆడై అంటే `డ్రెస్‌` అని అర్ధం. పుట్టుక‌తో డ్రెస్ వేసుకుని పుడ‌తామా.. అందుకే వ‌య‌సొచ్చాక కూడా డ్రెస్ ఎందుకు? అనే ధోర‌ణి ఉన్న మోడ్ర‌న్ అమ్మాయి క‌థ‌తో `ఆమె` తెర‌కెక్కింది. బోయ్స్ తో క‌లిసి మందు సిగ‌రెట్ విందు ఏదీ త‌ప్పు కాద‌ని బెట్టింగులు క‌ట్టే ఆమె క‌థ‌తో తెర‌కెక్కించిన చిత్ర‌మిది.