మూడు చోట్లా అమల ఫ్లాపే

Sun Mar 19 2017 14:07:15 GMT+0530 (IST)

అమల అక్కినేని. అసలు ఈవిడకు తిరిగి సినిమాల్లోకి ఎందుకు రావాలని అనిపించిందో తెలియదు కాని.. ఈ మధ్యన ఒక్కో ఫిలిం ఇండస్ర్టీలో ఒక్కో సినిమా చేస్తోంది. ఎక్కడైనా ఒక చోట హిట్టు కొడుతుందేమో అనుకుంటే.. అన్ని చోట్లా కూడా అమ్మడు మిస్ ఫైర్ అవుతోంది అంతే.

అసలు ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా అదరగొట్టిన అమల.. ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ పాత్రలకు నప్పుతుందని ఎవ్వరూ అనుకోరు. కాని ఫిలిం మేకర్లు మాత్రం.. ఒకప్పటి హీరోయిన్ తిరిగి సినిమాల్లోకి వస్తుందనే ఫీలింగ్ జనాల్లో కొత్త బజ్ క్రియేట్ చేస్తుందని ఫీలైయ్యి.. అమల వంటి సీనియర్లను దింపుతున్నారు. తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా చిన్నరోల్ చేసిన అమల.. తరువాత హిందీలో హమారీ అధూరి కహాని సినిమాలో ఒక పాత్రను చేసింది. రీసెంటుగా మలయాళంలో కేరాఫ్ సైరా భాను అనే సినిమాలో కూడా ఒక చిన్న వేషం వేసింది అమల. వినూత్నం ఈ సినిమాలన్నీ కూడా ఒకే తరహా రిజల్టును మూటకట్టుకున్నాయి.

ఈ మధ్యలో అమల 'మనం' సినిమాలో జస్ట్ అలా మెరిసింది. ఆ సినిమా మాత్రం అక్కినేని ఫ్యామిలీ అంతటికీ కలసికట్టుగా ఒక హిట్టిచ్చిందిలే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/