అమల సూపర్ నేచురల్ వెబ్ సిరీస్

Sat Apr 13 2019 19:50:26 GMT+0530 (IST)

వెబ్ సిరీస్ ల ట్రెండ్ అంతకంతకు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టు టాలీవుడ్ స్టార్లు వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. రాధిక ఆప్టే - కియరా అద్వాణీ - నిహారిక కొణిదెల- లక్ష్మీ మంచు- అవసరాల శ్రీనివాస్- రానా దగ్గుబాటి - కళ్యాణ్ రామ్ .. ఇలా ఎవరికి వారు వెబ్ సిరీస్ ప్లానింగ్స్ తో వేడి పెంచుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే బాలలో సీనియర్ కథానాయిక అక్కినేని అమల తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. హై ప్రీస్టెస్ అనేది ఈ వెబ్ సిరీస్ టైటిల్. జీ5లో టెలీకాస్ట్ కానుంది. పుష్ప ఇగ్నాటియస్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వ ం వహిస్తున్నారు. ఇందులో తమిళ కథానాయిక వరలక్ష్మి శరత్ కుమార్ బ్రహ్మాజీ సునయన కృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఏప్రిల్ 25 నుంచి ఇది ఎయిర్ లోకి రానుంది.ఇదో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న వెబ్ సిరీస్. అయితే ఇందులో అమల పాత్రకు స్పిరిట్యువల్ టచ్ ఉంటుందని తెలుస్తోంది. నేడు హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో అమల మాట్లాడుతూ - ``హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్ కథాంశం ఆసక్తికరంగా ఉంటుంది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ .. రకరకాల లేయర్స్ తో ఈ సిరీస్ కథనం రక్తి కట్టిస్తుంది. ఇందులో నా రోల్ గురించి దర్శకులు పుష్పతో చాలా కోణాల్లో చర్చించాను. సిరీస్ ముగింపును స్పిరిట్యువాలిటీతో అర్థవంతంగా ఉండాలని భావించాం. నా పాత్రకు చక్కని పర్పస్ ఫుల్ గా ఉండాలని భావించి తీర్చి దిద్దాం`` అని తెలిపారు.   

మరోవైపు అమల బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వ ంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఫర్ గాటెన్ ఆర్మీ`లో ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. సినిమాలు  నటనపైనా అమల మాట్లాడుతూ-``పూర్తిగా అటు వైపు ఆలోచించలేను. ఎందుకంటే నేను అక్కినేని ఫిలిం ఇనిస్టిట్యూట్ (AISFM) డైరెక్టర్ గా గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాను. అందువల్ల ఏదైనా ప్రాజెక్టును అంగీకరిస్తున్నాను అంటే అది చాలా విలువైనది అనుకుంటేనే అంగీకరిస్తాను`` అని తెలిపారు. ఇక వెబ్ సిరీస్ లో తన పాత్రను డిజైన్ చేయడంలో అమల అక్కినేని దర్శకురాలితో కలిసి చాలానే చర్చించానని అన్నారు కాబట్టి క్రియేటివ్ పార్ట్ లోనూ తన ప్రతిభను చూపిస్తున్నారన్నమాట.