Begin typing your search above and press return to search.

మంచు మనోజ్ డైరెక్టర్ మళ్లొస్తున్నాడు

By:  Tupaki Desk   |   29 Nov 2015 10:30 PM GMT
మంచు మనోజ్ డైరెక్టర్ మళ్లొస్తున్నాడు
X
మంచు మనోజ్ కెరీర్ లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో ‘మిస్టర్ నూకయ్య’ ఒకటి. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో మంచి బ్రేక్ వస్తుందని ఆశించిన డైరెక్టర్ అని కన్నెగంటి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ యంగ్ డైరెక్టర్ తీసిన తొలి సినిమా ‘అసాధ్యుడు’ కూడా అతడికి నిరాశనే మిగిల్చింది. ‘మిస్టర్ నూకయ్య’ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడానికి అనికి చాలా సమయమే పట్టింది. ఎట్టకేలకు అతను తన మూడో సినిమాకు రంగం సిద్ధం చేశాడు. ఇంతకుముందు సొంత కథలతో సినిమాలు తీసిన అని.. ఈసారి తమిళ రీమేక్ తో రాబోతున్నాడు.

తమిళంలో రెండేళ్ల కిందట విడుదలై మంచి విజయం సాధించిన ‘నేరం’ సినిమాను అతను రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ ‘నేరం’ సినిమా డైరెక్టర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన నాగచైతన్య హీరోగా రీమేక్ అవుతున్న ‘ప్రేమమ్’ సినిమా తీసిన అల్ఫాన్సో పుతెరినే ‘నేరం’ కూడా తీశాడు. అతడికదే తొలి సినిమా కూడా. ప్రేమమ్ కథానాయకుడు నివిన్ పౌలీనే హీరో. నజ్రియా నజ్రిన్ హీరోయిన్ గా నటించిన ‘నేరమ్’ ఇన్నోవేటివ్ మూవీగా మంచి పేరు తెచ్చుకుంది. దీని రీమేక్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.