Begin typing your search above and press return to search.

ప్రేమ‌మ్ డైర‌క్ట‌ర్‌ కి టాలీవుడ్‌ లో క్రేజు

By:  Tupaki Desk   |   30 Nov 2015 5:30 PM GMT
ప్రేమ‌మ్ డైర‌క్ట‌ర్‌ కి టాలీవుడ్‌ లో క్రేజు
X
ఒకే ఒక్క ఛాన్స్! ఒక్క ఛాన్స్ ప్లీజ్ !! అంటూ ప‌రిశ్ర‌మ‌లో చ‌కోర ప‌క్షుల్లా తిరిగేస్తుంటారు కొంద‌రు. కానీ ఆ ఒక్క ఛాన్స్ అంత వీజీ కాదు. అయితే ఓ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడికి మాత్రం అలాంటి అవ‌స‌రం కానీ సంద‌ర్భం కానీ రాలేదు. అత‌డు తెర‌కెక్కించిన మొద‌టి సినిమాతోనే బోలెడంత గుర్తింపు వ‌చ్చింది. రెండో సినిమాతో తిరుగులేని స్టాట‌స్‌ ని అందుకున్నాడు.

అతి త‌క్కువ రెమ్యున‌రేష‌న్ ఇచ్చే ప‌రిశ్ర‌మ‌గా మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌కి గుర్తింపు ఉంది. ఇప్పుడు అలాంటి చోట స్టిక్ అయిపోవాల్సిన ప‌నే లేకుండా ఏకంగా టాలీవుడ్ అత‌డికి రెడ్ కార్పెట్ వేసింది. అత‌డి పేరు ఆల్ఫోన్స్ పుథ‌రిన్‌. మనోడు ప్రారంభం ల‌ఘుచిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకుని, కాల‌క్ర‌మంలో నేరం అనే డార్క్ కామెడీ మూవీని తెర‌కెక్కించాడు. ఆ సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నాడు. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్ అనే క్లాసిక్ ల‌వ్‌ స్టోరీని తెర‌కెక్కించి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని మ‌న‌సు ప‌డి మ‌రీ ఎంచుకున్నాడు నాగ‌చైత‌న్య‌. ప్రేమ‌మ్ రీమేక్ హ‌క్కులు తీసుకుని మ‌రీ తెలుగులో తెర‌కెక్కిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ప్రేమ‌మ్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అని ఆరాతీస్తే తెలిసిన సంగ‌తులివి.

ఇకపోతే ప్రేమమ్‌ రీమేక్‌ మొదలవ్వగానే అత‌డు తెర‌కెక్కించిన నేరం చిత్రాన్ని టాలీవుడ్ హీరో సందీప్ రీమేక్ చేస్తుండ‌డం విశేషం. అందుకే కొంద‌రు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పిలిచి మరీ మనోడికి అవ‌కాశం ఇస్తామంటున్నారు. నేరుగా ఎదైనా తెలుగు స్ర్కిప్టు చెబుతానంటే నిర్మాత‌లు క్యూలో ఉన్నారు. అంతేకాదు కొంద‌రు స్టార్ హీరోల నుంచి ఆల్ఫోన్స్‌ కి ప్ర‌పోజ‌ల్స్ ఉన్నాయ‌ట.