Begin typing your search above and press return to search.

'స్వాతి ముత్యం' అల్లు అర్జున్ కూడా...

By:  Tupaki Desk   |   26 April 2017 2:12 PM GMT
స్వాతి ముత్యం అల్లు అర్జున్ కూడా...
X
స్టయిలిష్‌ హీరో ఒక ప్రక్కన తన సినిమా ''డిజె దువ్వాడ జగన్నాథమ్''తో బిజీగా ఉన్నాడని అనుకుంటే.. మరో ప్రక్కన మనోడు మాత్రం మెగా సీనియర్స్ ను ఫాలో అవుతున్నాడు. అదిగో చూస్తున్నారుగా.. ఎలాగైతే మెగాస్టార్ అండ్ పవన్ కళ్యాణ్‌ వెళ్ళి పర్సనల్ గా కలసి కళాతపస్విని అభినందించి వచ్చారో.. ఇప్పుడు బన్నీ కూడా అదే ఫాలో అయ్యాడు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కళాతపస్వికి అందిస్తున్న నేపథ్యంలో.. ఆయనకు తెలుగు ఇండస్ర్టీ నుండి అభినందనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం అల్ల అర్జున్ కూడా వెళ్ళి ఈ సందర్బంగా విశ్వనాథ్‌ ను అభినందించి వచ్చాడు. అయితే బన్నీని స్వాతి ముత్యం అన్నాం ఏంటనేగా మీ సందేహం. నిజానికి స్వాతిముత్యం సినిమాలో కనిపించే చాలామంది పిల్లల్లో బన్నీ కూడా ఒక పిల్లాడిగా నటించాడు. ఆ తరువాత మనోడు చేసిన ''బన్నీ'' సినిమాలో విశ్వనాథ్ కూడా నటించారు. ఆ విధంగా ఇద్దరికీ కనక్షన్ కూడా ఉంది.

ఇకపోతే ఇలా ఒకరి తరువాత ఒకరు మెగా హీరోలందరూ లైన్లు కట్టి కె.విశ్వనాథ్ దగ్గరకు వెళ్తున్నారంటే.. కొంపతీసి ఆయనతో ఏదన్నా సినిమా చేయించుకునే ప్లాన్ కాని వేశారా ఏంటి అనే సందేహం రాకమానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/