Begin typing your search above and press return to search.

ఏంటమ్మా? బన్నీ నెంబర్ అడిగాడా?

By:  Tupaki Desk   |   7 Feb 2016 9:30 AM GMT
ఏంటమ్మా? బన్నీ నెంబర్ అడిగాడా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే అభిమానించే వాళ్లు బోలెడు మంది ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీలోనూ బన్నీ అంటే విపరీతమైన క్రేజ ఉంది. అంతేకాదు.. తన జెంటిల్ మన్ బిహేవియర్ కి కూడా బన్నీకు గుర్తింపు ఎక్కువే. అమ్మాయిలకు ఎంతో గౌరవం ఇస్తాడని.. సరదాగా ఉన్నాసరే ఏ టైంలోనూ హద్దు దాటడని అల్లు అర్జున్ ని తెగ పొగిడేస్తారు.

అలాంటిది బన్నీ వెళ్లి ఓ ముక్కు మొహం తెలియని అమ్మాయిని నెంబర్ అడిగాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం అంటోంది ఓ భామ. గతంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన సోనాలీ రౌత్ ని.. గోవాలో ఓ పార్టీలో నెంబర్ అడిగాడట. 'ఓ జెంటిల్ మన్ నా దగ్గరకు నడిచొచ్చి.. తనని తాను అర్జున్ గా పరిచయం చేసుకున్నాడు. అతనిలో కాన్ఫిడెన్స్, బాడీ చూసి.. నేను అతనో అథ్లెట్ అనుకున్నాను. తనే మొబైల్ నెంబర్ అడిగాడు. నేను ఇచ్చేశా' అని ట్వీట్ చేసింది సోనాలి.

ఆ తర్వాత ఫ్రెండ్స్ చెబితే.. అతను అల్లు అర్జున్ అని తెలిసిందట. ట్విట్టర్ లో కోటిమంది ఫాలో అవుతున్న ఫేమస్ పర్సనాలిటీ వచ్చి.. తనను నెంబర్ అడిగి తీసుకోవడం ఫుల్లు హ్యాపీగా ఉందంటోంది సోనాలి. వినడానికి ఇది నమ్మేట్టుగానే ఉన్నా.. టాలీవుడ్ లో ఎంట్రీ కోసం.. ఈమె ఆడుతున్న గేమ్ ఇది అనే టాక్ వినిపిస్తోంది. ఒక వేళ బన్నీ ఈమెతో ఏదన్నా సాంగ్ లాంటివి ప్లాన్ చేసినా.. మేనేజర్ ని పంపుతాడు కానీ.. తనే వెళ్లి నెంబర్ అడిగే ఛాన్స్ లేదంటున్నారు. మరి బన్నీ వెర్షన్ ఏంటో తెలిస్తేనే.. ఇందులో నిజం ఎంతో అర్ధమవుతుంది.