Begin typing your search above and press return to search.

‘ధృవ’ రూమర్లపై అల్లు అరవింద్ హర్టయ్యాడు

By:  Tupaki Desk   |   24 Aug 2016 11:36 AM GMT
‘ధృవ’ రూమర్లపై అల్లు అరవింద్ హర్టయ్యాడు
X
మీడియాలో వచ్చే ప్రతి రూమర్ మీదా స్పందించాల్సిన పని లేదు. ఐతే అల్లు అరవింద్ మాత్రం తన బేనర్లో రాబోయే కొత్త సినిమా ‘ధృవ’ విషయంలో వస్తున్న రూమర్లపై కొంచెం హర్టయినట్లున్నాడు. ‘ధృవ’ షూటింగ్ లేటవుతోందని.. సినిమా అనుకున్న సమయానికి రెడీ కాకపోవచ్చని.. అందరూ అనుకుంటున్నట్లుగా అక్టోబరు 7న ఈ సినిమా విడుదల కాబోదని.. రెండు రోజులుగా మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. ఈ వార్తలు అల్లు అరవింద్ చెవినపడ్డాయి. ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓ ప్రెస్ నోట్ ఇచ్చేశారు. ఆరు నూరైనా అక్టోబరు 7నే సినిమా వచ్చి తీరుతుందని స్పష్టం చేశాడు.

సెప్టెంబరు 5న ‘ధృవ’ చివరి షెడ్యూల్ పూర్తవుతుందని.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయని.. పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుంటుందని.. అవి కూడా త్వరలోనే పూర్తి చేసి.. దసరా సందర్భంగా అక్టోబరు 7నే సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన ప్రకటించారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్యే రిలీజైన ‘ధృవ’ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ యు ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపిస్తాడు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. తమిళ వెర్షన్ కు సంగీతాన్నందించిన హిప్ హాప్ తమిళనే తెలుగు వెర్షన్ కూ మ్యూజిక్ చేస్తున్నాడు.