Begin typing your search above and press return to search.

సిక్స్ ప్యాక్ చేస్తున్నాడా??

By:  Tupaki Desk   |   19 April 2017 4:59 AM GMT
సిక్స్ ప్యాక్ చేస్తున్నాడా??
X
అల్లు శిరీష్ కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. గతేడాది శ్రీరస్తు..శుభమస్తు చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ మెగా ఫ్యామిలీ హీరో.. ఆ తర్వాత మలయాళ పరిశ్రమకు షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు అల్లు శిరీష్.

ఈ నెలాఖరుకు శిరీష్ కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టేయనున్నారట. ఈ చిత్రంలో డిఫరెంట్ గెటప్ తో కనిపించేందుకు.. కొన్ని వారాలుగా జిమ్ లో తెగ వర్కవుట్స్ చేసేస్తున్నాడు శిరీష్. ఇంత ఎక్కువ సమయం జిమ్ గడపడం చూసిన వారికి.. శిరీష్ చూపించబోయే లుక్ పై ఓ ఫైనల్ ఆలోచన వచ్చేసింది. దర్శకుడు ఆనంద్ కూడా శిరీష్ ని కొత్తగా చూపించబోతున్నానని చెప్పేశాడు. తన కొత్త మూవీలో ఈ అల్లు హీరో సిక్స్ ప్యాక్ చూపించేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ప్రతీ మూవీకి మేకోవర్ చేయడం అనేది ఈ మధ్య హీరోలకు బాగా అలవాటయిపోయింది. అందులో భాగంగానే శిరీష్ ఇలా ఫిక్స్ అయ్యాడట.

గతేడాది డీమానిటైజేషన్ సమయంలో కూడా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వీఐ ఆనంద్.. ఈ మూవీని కూడా డిఫరెంట్ గా తీర్చిదిద్దుతున్నాడని అంటున్నారు. అల్లు శిరీష్ కి జంటగా సురభి నటిస్తుండగా.. అవసరాల శ్రీనివాస్- సీరత్ కపూర్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ని ఫుల్ స్వింగ్ లో ఫినిష్ చేసి.. సెప్టెంబర్ నాటికి రిలీజ్ చేసేయాలని చూస్తున్నారట మేకర్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/