నటుడిగా శిరీష్ లో సీనెంత?

Sat May 18 2019 10:32:46 GMT+0530 (IST)

మెగా హీరోల్లో అల్లు శిరీష్ ఆరంగేట్రమే బిగ్ సర్ ప్రైజ్. ట్రేడ్ లెక్కలు గణాంకాల్లో పండితుడు అయిన శిరీష్ అసలు హీరో అవుతాడని తాము ఏనాడూ భావించలేదని మెగాస్టార్ సహా మెగా హీరోలంతా సర్ ప్రైజ్ అయ్యారు. ఆ సంగతినే పబ్లిక్ వేదికలపైనా వారు వీలున్న ప్రతి సందర్భంలో గుర్తు చేస్తారు. బాస్ అల్లు అరవింద్ లెగసీని నిర్మాతగా ముందుకు తీసుకెళతాడనుకుంటే ఏకంగా హీరోనే అయ్యాడు. అన్న అల్లు అర్జున్ ని మించి ఎదగాలని తపిస్తున్నాడు శిరీష్. హీరోయిజంలో ఉండే కిక్కును ప్రస్తుతం ఆస్వాధించాలన్న కసితో ప్రణాళికలు వేస్తున్నాడు. అయితే ఎగుడు దిగుడు దారిలో ఎప్పుడు హిట్టొస్తుంది.. ఎప్పుడు ఏమవుతోందో తెలీని సన్నివేశం కనిపిస్తోంది. శ్రీరస్తు శుభమస్తు తరహాలో క్లీన్ హిట్ మాత్రం కెరీర్ లో లేదు. ఒక్క క్షణం విమర్శకుల ప్రశంసలు పొందినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. అయితే నటుడిగా శిరీష్ పరిస్థితేంటి? అన్నది విశ్లేషిస్తే...తాజాగా రిలీజైన ఏబీసీడీ చిత్రంలో అతడి నటనకు క్రిటిక్స్ చక్కని మార్కులే వేశారు. ``అల్లు శిరీష్ గత సినిమాలతో పోలిస్తే బాగా ఇంప్రూవ్ అయ్యాడు. పరిణితి కనిపించింది. కొన్ని చోట్ల మినహాయిస్తే దాదాపు సినిమా మొత్తాన్ని మోసే బాద్యతను చక్కగా నిర్వర్తించాడు. డాన్సులు సోసోగానే ఉన్నా డైలాగ్ డెలివరీలో పరిణితి వచ్చింది. ఎక్స్ ప్రెషన్స్ పరంగానూ మార్పును చూడవచ్చు`` అంటూ క్రిటిక్స్ విశ్లేషించారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో అల్లు శిరీష్ ఇదే విషయాన్ని ప్రస్థావించడం ఆసక్తికరం. అల్లు శిరీష్ మాట్లాడుతూ .. ఈ సినిమాతో ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఈరోల్‌లో చేస్తున్నప్పుడు కనెక్ట్ అయ్యి బాగాఎంజాయ్ చేస్తూ చేశాను అని అన్నారు. ఏబీసీడీకి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందని... కొత్త జంట శ్రీరస్థు శుభమస్తు సినిమాల కంటె బెటర్‌గా ఓపెనర్ అయ్యిందని తెలిపారు.  శ్రీరస్థు శుభమస్తు సినిమా కలెక్షన్స్‌ను దాటాలని కోరుకుంటున్నానని అన్నారు. మంచి థియేటర్స్ ఇచ్చి రిలీజ్ చేయించిన సురేష్‌బాబుగారికి థాంక్స్ అని తెలిపారు.  68%తో ఉదయం ఆట ఓపెనింగ్స్ తో మొదలై .. 74% మ్యాట్నీకి పెరిగిందని .. ఫస్ట్ షోకి 78% పెరిగిందని దర్శకుడు మధుర శ్రీధర్ తెలిపారు. అయితే ఏబీసీడీకి అసలైన పరీక్ష సోమవారం నుంచి ఉంటుందనడంలో సందేహమేం లేదు.