Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ అని ఎందుకు పెట్టారంటే...

By:  Tupaki Desk   |   25 Aug 2016 9:04 AM GMT
గీతా ఆర్ట్స్ అని ఎందుకు పెట్టారంటే...
X
సినిమావాళ్లకు భక్తీ ఎక్కువే, తదనుగుణంగా సెంటిమెట్స్ కూడా చాలా ఎక్కువే! ఇందుకు సాక్ష్యంగా చాలా సినిమా బేనర్లు దేవుడి పేరుతోనే ఉండటాన్ని, సినిమా షూటింగ్ మొదలైనప్పటినుంచీ, ముగిసేవరకూ దేవుడి పూజా కార్యక్రమాలతోనే అన్నీ జరుగుతుండటాన్ని చెబుతుంటారు చాలామంది. అయితే తమ సినిమా బ్యానర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు అల్లు శిరీష్!

"గౌరవం" చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, అనంతరం "కొత్త జంట"తో పలకరించి తాజాగా వచ్చిన మూడో సినిమా "శ్రీరస్తు శుభమస్తు"తో హిట్ సాధించిన అల్లు శిరీష్ అభిమానులకు చేరువయ్యేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిరీష్, దాదాపు అన్ని విషయాలనూ అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. ఇదే క్రమంలో గురువారం కృష్ణాష్టమి సందర్భంగా చాలా ఆసక్తికరమైన కామెంట్ లు పోస్ట్ చేశాడు.

ముందుగా అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన శిరీష్.. భగవద్గీతను ప్రపంచానికి అందించిన కృష్ణుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా తమ నిర్మాణ సంస్థ "గీతా ఆర్ట్స్" పేరు వెనక ఉన్న రహస్యాన్ని కూడా బయటపెట్టాడు. "మా నాన్న భగవద్గీత ద్వారా ఎంతో ఇన్స్ పైర్ అయ్యారు, అందుకే మా బ్యానర్ కు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టారు" అని శిరీష్ అభిమానులకు తెలిపారు. "ఇంతవరకూ చాలా మందికి గీతా ఆర్ట్స్ అని మా బ్యానర్ కు ఎందుకు పేరుపెట్టామో తెలియదుదని.. ఈ విషయంలో చాలా మంది మా అమ్మ పేరు గీత అని, అందుకే ఆ పేరు పెట్టి ఉంటారని అనుకుంటారు.. కానీ ఆమె పేరు నిర్మల" అని శిరీష్ ట్వీట్ చేశాడు.