అల్లు హీరో.. పవన్ కి జై

Mon Mar 20 2017 12:45:10 GMT+0530 (IST)

అల్లు ఫ్యామిలీకి.. పవన్ కళ్యాణ్ కి మధ్య వివాదం ఏంటనే విషయం క్లారిటీగా చెప్పడం కష్టం. బైటకు చెప్పకపోయినా.. ఏదో తేడా ఉందని 'చెప్పను బ్రదర్' దగ్గర అది బయటపడిందని అంటారు ఇండస్ట్రీ జనాలు. పవన్-బన్నీ అభిమానుల మధ్య మొదలైన ఈ వివాదంలో నిజానికి అల్లు శిరీష్ ప్రత్యక్షంగా తలదూర్చలేదు.

కానీ అప్పట్లోనే పవన్ ను ట్విట్టర్ అన్ ఫాలో చేస్తూ తన అన్నకే మద్దతు పలికిన శిరీష్.. మళ్లీ ఇప్పుడు పవర్ స్టార్ ను ఫాలో చేస్తున్నాడు. అంతే కాదు.. పవన్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడుని తెగ పొగిడేశాడు కూడా. ఇంకా చెప్పాలంటే కాటమరాయుడు ట్రైలర్ ని అందరికంటే ముందు పొగిడిన మెగా హీరో అల్లు శిరీష్. ఇన్నేళ్లూ అన్ ఫాలో చేసి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని.. కాటమరాయుడుని ప్రశంసించడం వెనక కారణమేంటో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

కానీ కాటమరాయుడు ట్రైలర్ విషయంలో మెగా హీరోలంతా రియాక్ట్ అయినా.. బన్నీ సైలెంట్ గా ఉండడమే ఆశ్చర్యం కలిగించే విషయం. చెప్పను బ్రదర్ అంటూ అంత సీరియస్ గా రియాక్ట్ అవడానికి కారణం.. ఫ్యాన్స్ అత్యుత్యాహమే అంటూ బుకాయించిన బన్నీ.. నిజంగా అదే కారణం అయుంటే.. ఇప్పుడు కాటమరాయుడుపై స్పందించాలి కదా అన్నది పవన్ ఫ్యాన్స్ వెర్షన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/