Begin typing your search above and press return to search.

శిరీష్ సరిహద్దులు దాటించేస్తున్నాడు

By:  Tupaki Desk   |   16 May 2018 5:48 PM GMT
శిరీష్ సరిహద్దులు దాటించేస్తున్నాడు
X
రొటీన్ కు విభిన్నంగా ప్రయత్నించడం అల్లు శిరీష్ కు అలవాటు. టాలీవుడ్ లో చిన్న హీరోలు కూడా ఈవెంట్స్ ను హోస్ట్ చేయడం కనిపించేది కాదు. కానీ బాలీవుడ్ లో సల్మాన్.. షారూక్ లాంటి పెద్ద హీరోలే ఈ పని చేస్తుంటారు. ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసి.. తొలిసారిగా ఓ అవార్డ్ ఫంక్షన్ కు హోస్ట్ చేసే ధైర్యం చేశాడు. ఇప్పుడీ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది.

రీసెంట్ గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రత్యక్షం అయ్యాడు శిరీష్. సహజంగా ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో మన తెలుగు సినిమాలు భాగం కావడం కనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుందనే అంశంపై కాసింత పరిశోధన కూడా పూర్తి చేసిన శిరీష్.. తెలుగు సినిమాలు కూడా కేన్స్ లాంటి ఈవెంట్స్ లో భాగం కావడం అనే అంశానికి సరిహద్దులు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఇలాంటి కార్యక్రమాలలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పార్టిసిపేట్ చేసేందుకు ఆసక్తి చూపదంటూ.. కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి ఫిర్యాదు మాదిరిగా సమాచారం అందిందట.

'కేన్స్ లాంటి ఈవెంట్స్ లో మిలియన్ల కొద్దీ డాలర్ల డీల్స్ జరుగుతాయి. మరాఠీ.. మలయాళీ.. అస్సామీ సినిమాలు కూడా తమ మార్కెట్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ స్థానిక మార్కెట్లలో అతి పెద్దది అయిన టాలీవుడ్ మాత్రం ఇలాంటివాటికి దూరంగా ఉంది. వీటిపై టాలీవుడ్ తరఫున నేను ఓ నివేదికను కూడా అందించాను' అని చెప్పాడు శిరీష్. ఇకపై తెలుగు సినిమాలు కూడా ఇలాంటి భారీ ఈవెంట్స్ లో భాగం అవుతాయని ఆశిస్తున్నాడు ఈ అల్లు హీరో.