Begin typing your search above and press return to search.

హారర్ సినిమాలపై అల్లు కుర్రాడి ఫీలింగ్

By:  Tupaki Desk   |   30 Aug 2016 4:18 AM GMT
హారర్ సినిమాలపై అల్లు కుర్రాడి ఫీలింగ్
X
హారర్ సినిమాలను మన టాలీవుడ్ లో కామెడీ చేసి పారేశారు కానీ.. పాపం హాలీవుడ్ జనాలు ఇంకా భయపెట్టేలానే తీస్తున్నారు. మనోళ్లు అప్ డేట్ అయ్యారా.. వాళ్లు కాన్సెప్ట్ కి కట్టుబడిపోయారా అంటే చెప్పడం కష్టం కానీ.. ఫారిన్ మేకర్స్ తీసే హారర్ సినిమాలపై అల్లు శిరీష్ కి ఇప్పుడు ఓ డౌట్ వచ్చింది.

'కంజూరింగ్ గానీ వేరే సినిమాలు కానీ చూస్తున్నపుడు నాకు ఎగ్జాక్ట్ వచ్చిన డౌట్ ఇదే.. ఎందుకంటారు?' అని క్వశ్చన్ రాసి.. ఓ ఫోటో షేర్ చేశాడు శిరీష్. ఇంతకీ ఆ ఫోటోలో మేటర్ ఏంటంటే 'ఫారిన్ సినిమాల లాజిక్: ఇంట్లో దెయ్యాలున్నాయని తెలిసికూడా.. ఏం జరిగినా సరే పిల్లసను ఒంటరిగా పడుకోబెట్టాలి'. ఇదే ఆ ఫోటోలో ఎక్స్ ప్రెస్ చేసిన డౌట్. నిజానికి ఫారిన్ హారర్ సినిమాలన్నీ ఈ బాపతుగానే ఉంటాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన కంజూరింగ్2 ని కేక కేక అంటూ చూసేస్తారు కానీ.. పిల్లలను అలా విడిగా పడుకునేందుకు పర్మిషన్ ఇవ్వకపోతే అసలీ మూవీలే మేటరే ఉండదు.

ఈ విషయంలో మన సినిమా జనాలు బెటరే లెండి. ఏ కొంచె భయపడే పరిస్థితి ఉన్నా.. పిల్లలను తమ దగ్గరే ఉంచుకున్నట్లే సినిమాలు తీస్తుంటారు. అల్లు శిరీష్ ఎక్స్ ప్రెస్ చేసిన డౌట్ లో లాజిక్ చాలానే ఉంది కదూ.