Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్‌ 2.0 - బహుత్‌ బోరింగ్‌ హై

By:  Tupaki Desk   |   9 Oct 2015 4:11 AM GMT
అల్లు శిరీష్‌ 2.0 - బహుత్‌ బోరింగ్‌ హై
X
ప్రస్తుతం యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ ఏం చేస్తున్నాడు.. అయితే సినిమాలు చేస్తున్నాడు.. లేకపోతే కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నట్లు.. కొంతమంది సేవాతత్పరులను పిలిచి వారితో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాడు. మొన్ననే 'కోటి' మొక్కలు రామయ్యను పిలిచి ఆయనతో కలసి పొద్దున్నే టిఫిన్‌ కూడా లాగించేశాడు. అది అలా ఉంటే.. గత రాత్రి మనోడు ఒక కామెంట్‌ పాస్‌ చేశాడు.. అదేంటంటే..

''అల్లు శిరీష్‌ వెర్షన్‌ 2.0.. బాగా బోరింగ్‌.. డిప్లోమ్యాటిక్‌.. బాగా రిజర్వుగా ఉండే మనిషి. నాకు ఇలా ఉండటం అస్సలు ఇష్టం లేదు. బహుశా క్వార్టర్‌ లైఫ్‌ (25 ఏళ్ళు) క్రైసిస్‌ తో బాధపడుతున్నానేమో'' అంటూ సెలవిచ్చాడు. అదేంటి ఒక్కసారిగా అంత మాటనేశాడు? ఇక్కడే మనం ఓ మ్యాటర్‌ అర్ధం చేసుకోవాలి. గతంలో మనోడు ఒక సినిమా మ్యాగజైన్‌ రన్‌ చేశాడు. అలాగే ఇంకో రెండు మూడు సొంత వ్యాపారాలు కూడా రన్‌ చేశాడు. పెద్ద ముదురంటూ ఊరంతా టాక్‌ నడిచేది. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ట్వీట్‌ చేయడం.. బిజినెస్‌ గురించి క్లాసులు తీసుకోవడం.. కొత్త కొత్త బిజినెస్‌ థియరీలు చెప్పడం వగైరా వగైరా చేస్తుండేవాడు. అంతే కాదు.. ఎవరైనా ఏదైనా పంచ్‌ వేస్తే.. కావాలంటే నాలుగైదు అచ్చ తెలుగు స్వచ్ఛమైన బూతులు కూడా సింపుల్‌ గా య్యూజ్‌ చేశేసేవాడు.

కాని ఇప్పుడు సీన్‌ మారిపోయింది. యాక్టర్‌ గా నిలదొక్కుకోవాలంటే.. ఎంతో క్రిటిసిజం ను తట్టుకోవాలి. ఎవరేమన్నా పడాలి. కేవలం మన సినిమాలతో ప్రూవ్‌ చేసుకోవాలి. అప్పుడే రేంజ్‌ వచ్చేది. మాటలు స్లిప్పయితే కష్టం. బూతులు అస్సలు వాడకూడదు. దానికి మించి మనకు తెలిసిన ప్రతీ విషయంపై క్లాసులు తీసుకోకూడదు. అప్పుడు ఎక్కువ మంది దర్శకులు డేరింగ్‌ గా వచ్చి కథలు కూడా చెప్పరు. అందుకే.. శిరీష్‌ 2.0.. తనకి బహుత్‌ బోరింగ్‌ హై.. మనకు మాత్రం బగానే ఉందిలే హై!!