Begin typing your search above and press return to search.

హై స్పీడ్ లో ఎబిసిడి

By:  Tupaki Desk   |   13 Aug 2018 6:38 AM GMT
హై స్పీడ్ లో ఎబిసిడి
X
స్టైలిష్ స్టార్ తమ్ముడు అనే ట్యాగ్ ఉన్నా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న అల్లు శిరీష్ కొత్త సినిమా ఎబిసిడి షూటింగ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే కీలక భాగం సన్నివేశాలు పూర్తి కాగా త్వరలో టీమ్ అమెరికా వెళ్లబోతోంది. మధుర శ్రీధర్ నిర్మాణంలో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఎబిసిడి అంటే అమెరికన్ బోర్న్ కన్ ఫ్యూస్డ్ దేశీ. ఇద్దరు ఎన్ ఆర్ ఐలు అమెరికాకు వెళ్ళాక అక్కడ పడే ఇబ్బందుల నేపథ్యంలో మలయాళంలో వచ్చిన ఈ మూవీ కేవలం 4 కోట్ల బడ్జెట్ తో రూపొంది 15 కోట్లకు పైగా వసూళ్లతో ట్రేడ్ ని షాక్ కి గురిచేసింది. తనకో హిట్ కావాల్సిన నేపథ్యంలో అల్లు శిరీష్ దీన్ని తనకు సరైన కథగా గుర్తించాడు. రుక్సన్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మండన్న ఓ కీలకమైన క్యామియోకు ఓకే చెప్పింది అని వార్త వచ్చింది కానీ యూనిట్ ఖరారు చేయాల్సి ఉంది.

త్వరలో అమెరికా వెళ్ళబోతున్న టీమ్ ఇక్కడ పూర్తి చేయాల్సిన టాకీ పార్ట్ ఈపాటికే ఫినిష్ చేసినట్టు సమాచారం. గత ఏడాది శిరీష్ ఎన్నో అంచనాలతో చేసిన ఒక్క క్షణం కాన్సెప్ట్ పరంగా పెర్ఫార్మన్స్ పరంగా పేరు తీసుకొచ్చింది కానీ కమర్షియల్ గా ఆశించిన ఫలితం అందుకోలేదు. థిల్లర్ జానర్ లో చేసిన రిస్క్ అంతగా వర్క్ అవుట్ కాలేదు కాబట్టి శిరీష్ ఈ సారి ఆల్రెడీ ప్రూవ్ అయిన మలయాళీ రీమేక్ అందుకున్నాడు. ఒరిజినల్ వెర్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరో. అక్కడ తనకు ఇది చాలా పేరు తీసుకొచ్చింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశామని అందులో ఉన్న కామెడీ కంటే మెరుగ్గా ఇందులో ఎంటర్ టైన్ మెంట్ డోస్ పెంచామని దర్శకుడు చెబుతున్నాడు. మొత్తానికి స్లో అండ్ స్టడీ సూత్రం మీద చాలా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్న శిరీష్ ఎబిసిడి రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. విడుదల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.