Begin typing your search above and press return to search.

మల్లూవుడ్లో శిరీష్..మోహన్ లాల్ తో సినిమా

By:  Tupaki Desk   |   22 Oct 2016 11:30 AM GMT
మల్లూవుడ్లో శిరీష్..మోహన్ లాల్ తో సినిమా
X
ఈ మధ్యే ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో కెరీర్ లో తొలి విజయాన్నందుకున్నాడు అల్లు శిరీష్. ఆ తర్వాత శిరీష్ చేసే సినిమా విషయంలో కొంత గందరగోళం నడిచింది. ముందు కొత్త దర్శకుడు మల్లిడి వేణుతో సినిమా అనుకున్నారు కానీ.. అది వాయిదా పడింది. ఈలోపు ‘టైగర్’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చేయడానికి కమిటయ్యాడు శిరీష్.

ఈ సంగతలా వదిలేస్తే శిరీష్ ఇప్పుడో బంపర్ ఆఫర్ అందుకున్నాడు. అతను ఒక డైరెక్ట్ మలయాళంలో సినిమాలో నటించబోతుండటం విశేషం. అది కూడా సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో కావడం విశేషం. ఆ సినిమా పేరు.. 1971. సీనియర్ డైరెక్టర్ మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. మలయాళంలో డైరెక్ట్ సినిమా చేయడం.. అందులోనూ మోహన్ లాల్ తో కావడం శిరీష్ కు మామూలు అవకాశం కాదు. బహుశా ఈ ఛాన్స్ వెనుక శిరీష్ అన్నయ్య అల్లు అర్జునే ఉండి ఉండొచ్చు.

మల్లూవుడ్ లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా బన్నీ ప్రతి సినిమా మలయాళంలో భారీ ఎత్తున రిలీజవుతోంది. లేటెస్టుగా ‘సరైనోడు’ మలయాళ వెర్షన్ ‘యోధవు’ కూడా అక్కడ అదరగొట్టింది. బన్నీ డైరెక్ట్ మలయాళ సినిమా చేస్తే బాగుంటుందని అక్కడి ఫ్యాన్స్ ఆశిస్తుంటే అతడి తమ్ముడు మల్లూవుడ్లో అడుగుపెడుతున్నాడు. మోహన్ లాల్ సినిమాతో కాబట్టి తనేంటో ప్రూవ్ చేసుకుంటే అక్కడ మంచి కెరీర్ ఉంటుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/