Begin typing your search above and press return to search.

కజిన్ కామెంట్స్ నచ్చాయంటున్న శిరీష్

By:  Tupaki Desk   |   24 May 2018 8:44 AM GMT
కజిన్ కామెంట్స్ నచ్చాయంటున్న శిరీష్
X
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 80ల నాటి విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కలెక్షన్ల వసూళ్లలో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాపై మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తో సహా అంతా ప్రశంసల వర్షం కురిపించారు.

బాలీవుడ్ సినిమాలకు తీసిపోని రీతిలో రంగస్థలం వసూళ్లు సాధించడంపై ఇటీవల రామ్ చరణ్ ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ స్థాయి హిట్ సాధించడం వెనుక కారణంపై చరణ్ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ చెప్పిన సంగతులు మెగా ఫ్యామిలీలోని అల్లు శిరీష్ కు తెగ నచ్చేశాయి. ఈ ఇంటర్వ్యూ తప్పకుండా చదవమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘‘సాధారణంగా మనం ఫార్ములా లెక్కల ప్రకారం ముందుకెళ్లిపోతాం. లేకపోతే ముందు సక్సెస్ కొట్టిన సినిమా స్టయిల్ నే రిపీట్ చేస్తాం. ఇలాగైతే స్టోరీ టెల్లర్స్ గా మనం పైకెదగడం సాధ్యంకాదు’’ రామ్ చరణ్ చెప్పిన లైన్లను ప్రత్యేకంగా కోట్ చేసి మరీ పెట్టాడు అల్లు శిరీష్

తన కజిన్ రామ్ చరణ్ లోని మెచ్యూరిటీ అండ్ క్లారిటీ తనకు బాగా నచ్చిందని అల్లు శిరీష్ మెచ్చుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ ఎంతో బాగుందని.. అందరూ చదవాలని ట్వీట్ చేశాడు. రామ్ చరణ్ సినిమాయే కాదు... అతడి మాటలు కూడా శిరీష్ ను ఇంప్రెస్ చేసేశాయన్న మాట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిరీష్ పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్లను.. మెగా ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది.