Begin typing your search above and press return to search.

ర‌కుల్ ను చూసి కుళ్లుకుంటున్న మెగా హీరో

By:  Tupaki Desk   |   21 April 2018 10:09 AM GMT
ర‌కుల్ ను చూసి కుళ్లుకుంటున్న మెగా హీరో
X
స్టార్ స్టేట‌స్ వ‌చ్చాక వేసిన కొన్ని రాంగ్ స్టెప్స్‌ కార‌ణంగా... స్టార్ లీగ్ నుంచి వెన‌క్కి వెళ్లిపోయింది రకుల్ ప్రీత్ సింగ్‌. అయితే ఇక్క‌డ పోతేనేమో అక్క‌డ స్టార్ న‌వుతానంటూ కోలీవుడ్ కి చెక్కేసిందీ ముద్దు గుమ్మ‌. వెళుతూనే కార్తీ- సూర్య- శివ‌కార్తీకేయ‌న్‌ వంటి స్టార్ల సినిమాల్లో అవ‌కాశ‌లూ ద‌క్కించుకుంది. కోలీవుడ్‌ లో నెల‌న్న‌ర‌పాటు సాగిన స‌మ్మె ఎట్టకేల‌కు ముగియ‌డంతో చాలారోజుల త‌ర్వాత‌ షూటింగ్ కెళ్లింది ర‌కుల్‌.

త‌మిళ క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ‘ఎన్‌.జీ.కె’ సినిమా చెన్నై షూటింగ్‌లో పాల్గొంది ర‌కుల్‌. ఆ సంతోషంతో ‘ట‌డా.... షూటింగ్ డే 1’ అంటూ ట్వీట్ చేసింది ర‌కుల్‌. దానికి అల్లువార‌బ్బాయి శిరీష్ స్పందించాడు. ‘నిన్ను చూస్తే నాకు జెల‌స్ గా ఉంది. నా అభిమాన హీరోతో క‌లిసి న‌టిస్తున్నావ్‌...’ అంటూ పోస్ట్ చేసిన శిరీష్‌... వెంట‌నే జోక్ చేస్తున్నా... నీ కొత్త సినిమాకీ ఆల్ ది బెస్ట్‌! అంటూ ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు. వీరిద్ద‌రి ట్వీట్ల‌ను చూసిన వారంతా అల్లువారి చిన్న‌బ్బాయి హీరోయిన్ల పోస్ట‌ల‌కు మాత్రం భ‌లే త్వ‌రగా స్పందిస్తాడంటూ కామెంట్ చేస్తున్నారు. అవును మ‌రి... శిరీష్ పెట్టే కామెంట్లు ఎక్కువ‌గా హీరోయిన్లు పెట్టే పోస్టుల మీదే ఉంటాయి.

ఇదిలా ఉంటే సూర్య ఈ సినిమాలో ఓ విప్ల‌వ నాయ‌కుడి త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని టాక్‌. చె గువేరా లుక్ లో విడుద‌లైన సూర్య ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టికే ఈ సినిమాపై బీభ‌త్స‌మైన క్రేజ్ పెంచేసింది. ఈ సినిమాలో ఫిదా పిల్ల సాయిపల్ల‌వి కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం.