Begin typing your search above and press return to search.

అల్లు హీరో తక్షణ కర్తవ్యం ఏమిటో?

By:  Tupaki Desk   |   23 May 2019 4:43 AM GMT
అల్లు హీరో తక్షణ కర్తవ్యం ఏమిటో?
X
స్టైలిష్ స్టార్ తమ్ముడిగా అల్లు ప్లస్ మెగా కాంపౌండ్ సపోర్ట్ తో హీరోగా ఐదేళ్ల క్రితం పరిశ్రమలోకి అడుగు పెట్టిన అల్లు శిరీష్ కి తాజా చిత్రం ఎబిసిడి బ్యాడ్ మెమరీగా మిగలడం ఖాయమైపోయింది. ప్రమోషన్ కోసం టీమ్ థియేటర్లను చుడుతూ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని చెప్పుకుంటున్నా గ్రౌండ్ లెవెల్ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. హైదరాబాద్ మెయిన్ సెంటర్స్ ని మినహాయిస్తే తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన చోట్ల సగం కూడా ఫుల్ కాలేని పరిస్థితిలో ఎబిసిడిని చాలా భారంగా నడిపిస్తున్నారని ట్రేడ్ రిపోర్ట్.

తన కెరీర్ బెస్ట్ అని శిరీష్ పదే పదే చెబుతున్నాడు కానీ చేసిందే ఐదు సినిమాలు. అందులో ఆడింది ఒకటే. అలాంటప్పుడు హాలిడే సీజన్ లో ఎంతో కొంత మంచి ఓపెనింగ్ రావడం సహజం. అదీ వీకెండ్ కాబట్టి. ఆ మాత్రానికే సూపర్ హిట్ అనుకుంటే ఎలా. సో ఎబిసిడి మరో పాఠంగా నిలవడం తప్ప ఇంకే ప్రయోజనం కలిగించలేదు. విచిత్రంగా అన్నయ్య అల్లు అర్జున్ కానీ నాన్న అల్లు అరవింద్ కానీ ఎబిసిడి గురించి కనీస ప్రస్తావన తేకపోవడం గమనార్హం. ఇక మెగా హీరోలందరూ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు.

కారణాలు ఎన్ని ఉన్నా ఎబిసిడి వైఫల్యంలో దర్శకత్వందే కీలక పాత్ర . ఒక బాషలో సూపర్ హిట్ అయిన సినిమాను కనీసం యావరేజ్ గా నైనా మలుచుకోలేకపోయారు. మెల్లమెల్లగా పాట తప్ప ఇంకే చూడదగ్గ అంశం లేని కారణంగా మౌత్ టాక్ కూడా అలాగే బయటికి వెళ్తోంది. రేపు ఏకంగా నాలుగైదు సినిమాలు క్యులో ఉన్నాయి కాబట్టి ఎబిసిడి రన్ ప్రధాన కేంద్రాల్లో మినహాయించి ముగింపుకు వచ్చినట్టే