Begin typing your search above and press return to search.

మెగా హీరో సినిమాలో అల్లు కేమియో

By:  Tupaki Desk   |   10 Feb 2016 1:30 PM GMT
మెగా హీరో సినిమాలో అల్లు కేమియో
X
హీరోగా ఎదిగేందుకు అల్లు వారబ్బాయి శిరీష్ బాగానే ట్రై చేశాడు కానీ.. ఆ తర్వాత ఎందుకో దూరంగానే ఉంటున్నాడు. మూవీస్ కు బదులుగా బ్యాకెండ్ కార్యకలాపాల్లో మాత్రం బాగా యాక్టివ్ గానే ఉంటాడు అల్లు అర్జున్ సోదరుడు. రీసెంట్ గా జరిగిన ఐఫా అవార్డుల వేడుకను హోస్టింగ్ కూడా చేసేశాడు. ఇప్పుడు ఓ మెగా వారసుడి సినిమాలో అల్లు శిరీష్ కేమియో చేయబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి.

మెగా సుప్రీం స్టార్ సాయి ధరం తేజ్ హీరోగా సుప్రీం టైటిల్ పై ఓ మూవీని నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ఓ ఫన్నీ రోల్ ఉంటుందట. ఈ పాత్రను ఎవరితో చేయించాలని సుదీర్ఘంగా ఆలోచించిన యూనిట్.. చివరకు శిరీష్ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. డిఫరెంట్ సిట్యుయేషన్ లో వచ్చే ఈ రోల్ మూవీకి కీలకంగా ఉంటుందిట. అయితే క్లైమాక్స్ లో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించే పాత్ర ఇది. దీనికోసం అల్లువారబ్బాయిని అడగడం.. శిరీష్ ఓకే చేసేయడం కూడా జరిగిపోయాయని తెలుస్తోంది.

పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సుప్రీంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మెగా హీరో నటించిన చివరి రెండు చిత్రాలు పిల్లా నువ్వు లేని జీవితం - సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ కావడంతో.. హ్యాట్రిక్ కొట్టాలనే స్పీడ్ తో ఉన్నాడు తేజు. సుప్రీమ్ లో హీరో పాత్ర క్యాబ్ డ్రైవర్ కాగా.. హీరోయిన్ రాశి ఖన్నా పోలీస్ పాత్రలో నటిస్తోంది.