Begin typing your search above and press return to search.

సంక్రాంతి బరిలోకి స్టైలిష్ స్టార్ ?

By:  Tupaki Desk   |   22 May 2019 5:19 AM GMT
సంక్రాంతి బరిలోకి స్టైలిష్ స్టార్ ?
X
ప్రతి ఏడాది సంక్రాంతి పోరు మహారంజుగా మారుతోంది. స్టార్స్ కు వసూళ్ళ వర్షం కురిపించుకునేందుకు సంవత్సరం మొత్తంలో ఇదే బెస్ట్ సీజన్ కావడంతో విడుదల బెర్తుల కోసం పోటీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఈసారి రామ్ చరణ్ బాలకృష్ణ వెంకటేష్ రజనికాంత్ పోటీ పడగా ఒక్కరే విజేతగా నిలవడం ట్రేడ్ ను నిరాశ పరిచినా పండగ మీద క్రేజు మోజు మాత్రం ఎప్పటికీ తగ్గదు.

అందుకే రాబోయే ఫెస్టివల్ కు అప్పుడే హీరోలు కర్చీఫ్ లు వేయడం మొదలుపెట్టారు. 2020కి ఇప్పటికే బాలకృష్ణ-కెఎస్ రవికుమార్ మహేష్-అనిల్ రావిపూడి సినిమాలు కన్ఫర్మ్ కాగా మారుతీ-సాయి తేజ్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఇది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీటితో పాటు పొంగల్ ను టార్గెట్ చేసుకున్న రజనికాంత్ దర్బార్ కూడా అదే టైం ని లాక్ చేసుకుంది

ఇవి చాలవు అన్నట్టు ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగుతున్నట్టు టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని తొలుత దసరా అనుకున్నప్పటికీ ఆశించిన వేగంతో షూటింగ్ జరిపే పరిస్థితి కనిపించకపోవడంతో వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎలాగూ దసరా పండక్కు మెగాస్టార్ సైరా వచ్చే అవకాశాల గురించి చర్చ జోరుగా సాగుతోంది.

అది ఫిక్స్ అయితే మెగా హీరోలతో సహా ఎవరూ పోటీకి రిస్క్ చేసే సాహసం చేయరు. అది దాటితే భారీ సినిమాలకు నవంబర్ డిసెంబర్ అంత మంచి సీజన్ కాదు. అందుకే సేఫ్ జోన్ పరంగా బన్నీ మూవీని కూడా జనవరికే పుష్ చేస్తారని తెలుస్తోంది. ఇది ఖరారు కావడానికి టైం పడుతుంది కాని మొత్తానికి 2019లో టోటల్ గా బన్నీ సినిమా లేనట్టే