బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయనతోనేనా?

Mon Apr 16 2018 22:09:06 GMT+0530 (IST)

ప్రస్తుత రోజుల్లో దాదాపు స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక కథను ఫైనల్ చేస్తున్నారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంపై క్లారిటికి రాలేకపోతున్నారు. నా పేరు సూర్య మొదలుపెట్టినప్పటి నుండి బన్నీ మరొక సినిమా చేసేద్దాం అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వలేదు. మధ్యలో చాలా మంది దర్శలులతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.అది నిజమే కానీ బన్నీ మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పలేదు. అందుకే అఫీషియల్ గా ఎవరు ప్రకటించలేదు. సుకుమార్ - విఐ ఆనంద్ పేర్లు బాగానే వచ్చాయి. దాదాపు కథ ఫైనల్ అయ్యినట్లు టాక్ కూడా వచ్చింది. ఇకపోతే ఇప్పుడు బన్నీ తన చూపుని అగ్ర దర్శకుడైన కొరటాల శివ వైపు చూస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల తెరకెక్కించిన భరత్ అనే నేను సినిమా విడుదలకు ఎంతో సమయం లేదు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.

ఆ సినిమా రిజల్ట్ వచ్చాక స్టోరీ డిస్కర్స్ చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. ఇక బన్నీ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. మరి కొరటాల ఎలా ఆలోచిస్తాడో చూడాలి. ఇక బన్నీ మాత్రం సుకుమార్ ప్రాజెక్ట్ ఒకే చేస్తే మరుక్షణం సినిమా పట్టాలెక్కేస్తుంది. కానీ మహేష్ సుకుమార్ తో చేయాలని అనుకుంటున్నాడు. విఐ.ఆనంద్ అప్పట్లో చేద్దామని అనుకున్నప్పటికి ఒక్క క్షణం అనుకున్నంత రేంజ్ లో హిట్టు అందకపోవడంతో మనసు మార్చుకున్నట్లు సమాచారం. మొత్తంగా కుదిరితే బన్నీ - కొరటాల కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ విషయం ఎప్పుడు చెబుతారో చూడాలి.