నంది గోలను వదిలేసి.. కొడుకుతో క్రికెట్

Sat Nov 18 2017 16:30:45 GMT+0530 (IST)

ఎప్పుడూ లేనిది నంది అవార్డుల విషయంలో పక్షపాత ధోరణి చూపించారని ప్రస్తుతం వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద మచ్చనే తెచ్చిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కొందరు ఆరోపణలు చేసినా ఎక్కువగా హైలెట్ అయ్యేవి కావు. ఈసారి ఏం జరిగిందో గాని చాలా మంది పలురకాలుగా కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై సెటైర్లు కూడా వేశారు.కానీ కొంతమంది తారలు మాత్రం ఈ విషయం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి అసలు రెస్పాన్స్ లేదు. ఒక్క అల్లు అర్జున్ కి తప్పితే మెగా హీరోలకు ఏ పురస్కారం దక్కలేదు. ఇక రుద్రమదేవి చిత్రానికిగాను ఎస్వీ రంగారావు పేరుతో ఉన్న అవార్డును అందుకున్న బన్నీ కూడా ఏ మాత్రం స్పందించలేదు. ఎటువంటి విషయాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా తెలిపే బన్నీ ఈసారి అసలు గుర్తింపు దక్కిందని ఓ మాట కూడా చెప్పలేదు.

వివాదాలు జరుగుతున్నాయని అనుకున్నాడో మరి మనకెందుకులే అనుకున్నాడో గాని అసలు ఏమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా బన్నీ తన కొడుకుతో క్రికెట్ ఆడుకుంటున్న ఫొటోని భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. షూటింగ్ లో గ్యాప్ దొరకడంతో కొడుకుతో ఇలా షూటింగ్ స్పాట్ లో బన్నీ దర్శనం ఇచ్చాడు.