బన్నీ లైబ్రెరీలో ఏం చేస్తున్నాడు!

Thu Sep 14 2017 11:50:57 GMT+0530 (IST)

దువ్వాడ జగన్నాథం హిట్టో లేక ఫట్టో అనే విషయాన్ని పెద్ద మిస్టరీలా వదిలేసి తన తదుపరి సినిమా షూటింగ్ లోకి దిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కిక్ రైటర్ వక్కంతం వంశీకి డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తూ నా పేరు సూర్య నా  ఇల్లు  ఇండియా అనే ప్రాజెక్ట్ ను ఇటీవలే బన్నీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నాడు. బన్నీ ఈ మూవీ కోసం ఫారిన్ నుంచి ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ని దిగుమతి చేసుకొని మరీ కొన్ని కఠినమైన కసరత్తలు చేసినట్లుగా ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలైందని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోలో ఓ లైబ్రెరి సెట్ లో బన్నీ - అర్జున్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం.

అయితే ఇటీవల కాలంలో తన సినిమాకి రిలేటైన ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా విషయంలో మాత్రం మొదట్లోనే కాస్త తడబడినట్లుగా సినీ జనాల్లో ఓ టాక్ ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. దాదాపు కోటీ రూపాయలు ఖర్చు పెట్టి వేసిన ఈ లైబ్రెరీ సెట్ ఉన్నట్లుండి ఒక్క సారిగా కుప్పకూలిపోయిందట. కానీ ఆ సమయంలో నిపుణులు - కార్మికలు ఎవ్వరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెబుతున్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్ కి గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో మళ్లీ ఈ సెట్ వెంటనే పునఃనిర్మించడం జరిగిందని ప్రస్తుతం మళ్లీ బన్నీ షూటింగ్ కి హాజరవుతున్నాడని చిత్ర వర్గాలు తెలిపాయి. మరి వక్కంతం వంశీ బన్నీని ఎలా చూపించబోతున్నాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.