Begin typing your search above and press return to search.

బన్నీ ఆ జోనర్ పై కన్నేశాడా?

By:  Tupaki Desk   |   27 April 2016 7:30 AM GMT
బన్నీ ఆ జోనర్ పై కన్నేశాడా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నంత హ్యాపీగా.. ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరో కూడా లేడని చెప్పచ్చు. సినిమాకి మంచి టాక్ వచ్చి హిట్ కొట్టడం ఓ లెక్క అయితే.. డివైడ్ టాక్ వచ్చాక బ్లాక్ బస్టర్ రూట్ లో దూసుకుపోవడం మాత్రం బన్నీకే చెల్లింది. సమ్మర్ కి వచ్చిన సరైనోడుకి బాక్సాఫీస్ దగ్గర వస్తున్న కలెక్షన్స్ చూసి.. ఇండస్ట్రీ జనాలకు మతులు పోతున్నాయి. అందుకే బన్నీ బాబు ఇప్పుడు ఫుల్లు హ్యాపీ అంటున్నారు సరైనోడు యూనిట్.

ఇదే ఊపుతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు అల్లు అర్జున్. ఈసారి తన సినిమా రెండు భాషల్లో తీసేదిగా ఉండాలన్నది బన్నీ ఐడియా. తెలుగు-తమిళ్ లో ఒకే సమయంలో సినిమా చేయడం ద్వారా.. అక్కడి మార్కెట్ ని కూడా కాప్చర్ చేసే దిశగా బన్నీ అడుగులు పడుతున్నాయి. అందుకే లింగుస్వామిని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే లింగుస్వామి బన్నీకి ఓ స్టోరీ చెప్పాడట. అయితే.. ఇది సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కావడం.. అల్లు అర్జున్ ని కూడా ఆశ్చర్యపరిచిందని అంటున్నారు.

లింగు స్వామి చెప్పిన కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసినా.. బన్నీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ప్రస్తుతం లవర్ బోయ్ నుంచి మాస్ హీరో ఇమేజ్ కి అప్ గ్రేడ్ చేసుకోగా.. ఇలాంటి టైంలో ఫిక్షన్ మూవీ చేయడమా అనే ఆలోచనలో ఉన్నాడట. అయితే.. బన్నీ ఈ సినిమాని ఒప్పుకునేందుకే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు అంటున్నారు.