డీజే.. చలో అమెరికా

Mon Jun 19 2017 14:47:33 GMT+0530 (IST)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం  రిలీజ్ కు సిద్ధమైంది.  హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాపై బజ్ ఎక్కువగానే ఉంది.  అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ఈ సినిమా బాగానే కలెక్షన్లు రాబట్టే అవకాశముంది. యూఎస్ నుంచి కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టేందుకు హీరో అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు.

జూన్ 30 నుంచి జులై  2వరకు చికాగోలో జరిగే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సభలకు అల్లు అర్జున్ హాజరు కానున్నాడు. పనిలో పనిగా అమెరికాలోని ముఖ్యమైన సిటీల్లో తిరిగి తన డీజే సినిమాను బాగా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడట.  ఎందుకంటే బన్నీ లాస్ట్ ఫిలిం సరైనోడు ఇక్కడ మంచి కలెక్షన్లే రాబట్టినా యూఎస్ లో మాత్రం  పెద్దగా వర్కవుట్ అవలేదు. అమెరికాలో మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ సరైన ప్రమోషన్ లేని కారణంగానే కలెక్షన్లు పెద్దగా రావడం లేదని... అందుకే ఈసారి టూర్ లో వారిని అట్రాక్ట్ చేసే ప్రోగ్రాం ప్లాన్ చేశాడన్నది అర్జున్ సన్నిహితుల మాట.  

గతనెలలో అమెరికాలోనే జరిగిన తానా మహా సభలకు నందమూరి కళ్యాణ్ రామ్ కు ఆహ్వానం అందింది. అక్కడకు వెళ్లి రావడానికి అయిన ఖర్చు మొత్తం సొంత జేబుల నుంచి  అందరి మెప్పు అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు నాట్స్ సభలకు వెళ్తున్న అల్లు అర్జున్ కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తాడా అన్న క్వశ్చన్ వస్తోంది. చూద్దాం.. బన్నీ ఏమంటాడో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/