Begin typing your search above and press return to search.

బన్నీ సినిమాకు అందుకే బ్రేక్ వేశారా?

By:  Tupaki Desk   |   19 July 2019 6:04 AM GMT
బన్నీ సినిమాకు అందుకే బ్రేక్ వేశారా?
X
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమా షూటింగ్ కు ఇటీవలే చిన్న బ్రేక్ పడిందని టాక్ వచ్చింది. దానికి కారణం హీరో అల్లు అర్జున్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కు వచ్చిన ఆర్గుమెంట్ అని ప్రచారం జరిగింది. అయినా దీనికి పోస్ట్ పోన్ వాయిదా వేయడానికి సంబంధం ఏంటి అనే అనుమానాలు అలాగే ఉన్న తరుణంలో దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకో న్యూస్ రూపంలో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం బన్నీ సాధారణంగా ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. నా పేరు సూర్య తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా అదే అని టాక్ ముందు నుంచీ ఉంది. ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు అన్ని చెక్ చేసుకుని కానీ వర్క్ మొదలుపెట్టడు. ఇది మొదటి నుంచీ ఉన్న అలవాటే. అతనికి దగ్గరగా ఉన్న వాళ్లకు ఈ సంగతి బాగా తెలుసు ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ లో ఓ చిన్న డైలాగ్ కి సంబంధించి సదరు అసిస్టెంట్ డైరెక్టర్ బన్నీకి మధ్య చిన్న చర్చ హాట్ డిస్కషన్ గా మారిపోయిందట.

పర్ఫెక్షన్ గురించి తాను స్పష్టంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నా అలాంటిదేమి లేదన్న తరహాలో ఆ అసిస్టెంట్ చెప్పడంతో ఇది వేరే టర్నింగ్ తీసుకుందని సమాచారం. మొత్తానికి అలా ఆ రోజు క్యాన్సిల్ చేసిన షూట్ మళ్ళీ 20 నుంచి తిరిగి మొదలుపెడుతున్నారట. అయినా ఇదంతా జరుగుతున్నప్పుడు త్రివిక్రమ్ ఏం చేశాడు అనే డౌట్ వస్తుందిగా. ఆయన సర్దడం వల్లే ఆలస్యం తగ్గి త్వరగా రీ స్టార్ట్ అయ్యిందని సమాచారం. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జయరాం-టబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు