Begin typing your search above and press return to search.

బ‌న్నీస్ బ్రో త‌లా లెక్కున్నాడే!

By:  Tupaki Desk   |   24 Aug 2018 4:54 AM GMT
బ‌న్నీస్ బ్రో త‌లా లెక్కున్నాడే!
X
హేయ్ .. బ‌న్ని బ్రోని చూశారా? అచ్చం తలా అజిత్ లెక్కున్నాడు. కాస్త సైడ్ ట‌ర్నింగ్ ఇచ్చుకుంటే సామి స్క్వేర్‌ లా ఉన్నాడు! నెరిసిన గ‌డ్డం.. పండిన మీస‌క‌ట్టు.. హెయిర్ క‌ట్‌.. షూటు బూటూ .. ఈ వ్య‌వ‌హారం చూస్తుంటే అచ్చం కార్పొరెట్ గురుడులా అనిపించ‌డం లేదూ? అవును.. అత‌డు ఒక్కోసారి త‌లా మాదిరిగా, ఇంకోసారి చియాన్ మాదిరిగా క‌నిపిస్తున్నాడు. అస‌లింత‌కీ ఇంత ట్రాన్స్‌ ఫ‌ర్మేష‌న్ ఎలా వ‌చ్చింది? అంటారా?

అస‌లు అల్లు అర్జున్‌ కి ఇంత పెద్ద‌న్న‌య్య కూడా ఉన్నాడా? అంటూ కొద్దిమందికి కన్ఫ్యూజ‌న్‌ తో పాటు, ఆశ్చ‌ర్య‌పోయేవాళ్ల‌కు ఇడిగో ఈయ‌నే చూడండి. త‌మ్ముడు అల్లు శిరీష్‌కి ఉన్నంత ఫోక‌స్ అన్న‌య్య బాబీకి లేక‌పోవ‌డానికి కార‌ణం అత‌డు తెర‌వెన‌క ఉండిపోవ‌డ‌మే. ఏ ప్ల‌స్ బి వోల్ స్క్వేర్ ఫార్ములాని ప‌దే ప‌దే వ‌ల్లించిన‌ట్టు బ‌న్నికి బాబి అనే అన్న‌య్య ఉన్నాడ‌ని ప‌దే ప‌దే చెప్పాలా ఏం? అన్న‌య్య ఉన్నాడు అంతే!

వెంక‌టేష్ అలియాస్ బాబిగా పిల‌వ‌బ‌డే బన్నీస్ బ్రో.. ఈ కొత్త‌లుక్‌కి మారాక అస‌లే గుర్తుప‌ట్టలేక‌పోతున్నారు. అల్లు బ్ర‌ద‌ర్స్ ముగ్గురి మ‌ధ్యా అనుబంధం ఎంతో గొప్ప‌ది. ఇదిగో మొన్న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌ డే వేళ బాబి ఇలా చిరుకి స్వీట్ తినిపించి బ‌ర్త్‌ డే విషెస్‌ ని తెలిపారు. అప్పుడు ఇలా కొత్త లుక్‌ తో షాకిచ్చారు.