Begin typing your search above and press return to search.

బన్నీ కూడా పాటేసుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   12 Feb 2016 3:30 AM GMT
బన్నీ కూడా పాటేసుకుంటున్నాడు
X
అల్లు అర్జున్ ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకడు. వరుసగా యాభై కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాలు మూడు ఉన్న ఏకైక హీరోగా రికార్డు బన్నీ పేరు మీదే ఉంది. అలాగే అల్లు వారబ్బాయికి డ్యాన్సుల్లో కాంపిటీషన్ ఇవ్వడం చాలా కష్టమైన విషయం. భీకరమైన స్టెప్స్ వేసేస్తూ.. కళ్లు బైర్లు కమ్మేలా చేస్తాడు ఈ మెగా హీరో. ఇప్పుడు బన్నీ తన ట్యాలెంట్ ని మరో రంగంలో కూడా చూపించబోతున్నాడు.

ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సరైనోడు చిత్రాన్ని చేస్తున్న అల్లు అర్జున్.. ఇందులో ఓ పాట కూడా పాడేస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ఎస్ ఎస్ థమన్.. బన్నీని పాట పాడాల్సిందిగా కోరాడట. క్యాచీగా ఉండే ఓ లిరిక్ ని, అంతకంటే సూపర్బ్ ట్యూన్ తో కలిపి కంపోజ్ చేశాడట. పాట కూడా బన్నీకి బాగా నచ్చడంతో.. ఆ సాంగ్ ను తనే పాడేసేందుకు బన్నీ సై అనేశాడని తెలుస్తోంది.

థమన్ గతంలో కూడా హీరోలను సింగర్స్ గా మార్చేశాడు. రవితేజ - ఎన్టీఆర్ లతో కూడా పాటలు పాడించి, సింగర్లుగా మార్చిన ఘనత ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి ఉంది. అలాగే ఎన్టీఆర్ - కాజల్ అగర్వాల్ లతో .. కన్నడలో కూడా ఓ పాట పాడించాడు థమన్. ఇప్పుడు బన్నీతో కూడా సాంగ్ పాడించేసి, ఇండస్ట్రీకి కొత్త సింగర్ ని తీసుకొచ్చేస్తున్నాడన్న మాట. ఇలా ప్రతీ సినిమాలోనూ పాడించేస్తే.. తర్వాత అది రొటీన్ అయిపోతుందేమో థమన్. కాస్త ఆలోచించు..