Begin typing your search above and press return to search.

కూతురి కోసం బన్నీ సింగపూర్ ట్రిప్

By:  Tupaki Desk   |   24 Nov 2017 11:06 AM GMT
కూతురి కోసం బన్నీ సింగపూర్ ట్రిప్
X
టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీని చూడకుండా ఒక ఐదు రోజులైనా ఉండలేడు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బన్నీ సోషల్ మమీడియాలో కూడా ఫాలోవర్స్ సంఖ్యని రోజు రోజుకు పెంచుకుంటూ వెళుతున్నాడు.

కేవలం సినిమాలకు సంబందించిన విషయాలను మాత్రమే కాకుండా తన పర్సనల్ ఫ్యామిలీ సంతోషాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటాడు. రీసెంట్ గా బన్నీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో మొదట బన్నీ తన కూతురు అర్హ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలను తెలుపుతూ బన్నీ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక అర్హ పుట్టిన రోజూ సెలబ్రేషన్స్ ని బన్నీ సింగపూర్ కి షిఫ్ట్ చేశాడు. అక్కడ స్పెషల్ గా ఉండే ప్రదేశాలను చుట్టేస్తోందట బన్నీ ఫ్యామిలీ. ఇక నైట్ సింగపూర్ లోని మరీనా బే వద్ద జరిగిన ఫౌంటెన్ షోను చూస్తూ అల్లు ఫ్యామిలీ బలే ఎంజాయ్ చేసిందట. అందుకు సంబంధించిన ఫోటోని బన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో స్టయిలిష్ స్టార్ అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది.