Begin typing your search above and press return to search.

బన్నీకి పోటీ వస్తున్న వరుణ్ తేజ్

By:  Tupaki Desk   |   21 Feb 2018 5:21 PM GMT
బన్నీకి పోటీ వస్తున్న వరుణ్ తేజ్
X
సినిమాల ఎంపిక విషయంలో హీరోలు ఎంత జాగ్రత్తగా ఉంటారో.. ఆ చిత్రాలకు టైటిల్ ను ఫిక్స్ చేసుకోవడంలో కూడా అంతే అలర్ట్ గా ఉండాలి. ఒకే పేరు కోసం ఇద్దరేసి హీరోలు పోటీ పడ్డం.. చివరకు ఆయా హీరోల పేర్లు ముందు తగిలించేసి.. రెండు సినిమాలను తీసుకురావడం గతంలో చూశాం. కానీ ఇప్పుడు ఒకే టైటిల్ కోసం.. ఇద్దరు మెగా హీరోలు పోటీ పడుతున్నారట.

అహం బ్రహ్మాస్మి అన్నదే ఆ టైటిల్. ఈ పేరుపై ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్.. ఇప్పటికే ఓ కథ సిద్ధం చేసుకున్నాడని కొన్ని నెలలుగా మాటలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మూవీ మణికర్ణిక కోసం వాయిదా వేసుకున్నాడు కానీ.. లేకపోతే ఈ పాటికే ఈ ప్రాజెక్టు మొదలైపోయేదట. ఈ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్ సై అన్నాడనే టాక్ కూడా ఉంది. నా పేరు సూర్య తర్వాత ఇదే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇదే టైటిల్ కోసం వరుణ్ తేజ్ పోటీ వస్తున్నాడట.

ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి రీసెంట్ గా వరుణ్ తేజ్ కు ఓ కథ వినిపించి.. అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ ను సూచించాడట. సైన్స్ ఫిక్షన్ స్టోరీ తెగ నచ్చేసిన నాగబాబు తనయుడు ఓకే చెప్పేశాడని కూడా అంటున్నారు. కానీ ఈ టైటిల్ ను ఇప్పటికే క్రిష్ రిజిస్టర్ కూడా చేయించేశాడట. మరి అహం బ్రహ్మాస్మి టైటిల్ చివరకు ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇక్కడ బన్నీ తనకు కావాల్సిందే అని పట్టుపడితే మాత్రం.. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదులే!